గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 16:58:04

అవిసె గింజలు మహిళల ఆరోగ్యానికి ఎంత మేలో... తెలుసా...?

అవిసె గింజలు మహిళల ఆరోగ్యానికి ఎంత మేలో... తెలుసా...?

హైదరాబాద్ :అవిసె గింజలు వీటినే "ఫ్లాక్స్ సీడ్స్" అని కూడా అంటారు. వీటిలో ఆరోగ్య కరమైన పోషకాలున్నాయి. ఈ గింజలు మహిళలు ఎదుర్కునే మెనోపాజ్ సమస్యలను తగ్గిస్తాయి.

-నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా చూస్తుంది. రుతుస్రావం సమయంలో వచ్చే సమస్యలను పరిష్కరించడంలోనూ, హార్మోన్ల సమతుల్యతను నిర్వహించడంలోనూ సహాయపడతాయి. 

-ప్రతి రోజూ  ఒక టీ స్పూన్ మోతాదులో ఈ గింజలు తీసుకుంటే హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. అవిసె  గింజలను శుభ్రం చేసి కొద్దిగా వేయించి పొడి చేసుకుని దానిని మజ్జిగలో కానీ లేదా కారప్పొడి రూపంలో చేసుకుని కానీ తీసుకోవచ్చు.

-ఇలా చేయడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చట. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా ఇవి బాగా పని చేస్తాయి.

-శరీరానికి అవసరమైన రోజువారీ పోషకాలను అందిస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) ను తగ్గిస్తుంది.

-రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇవి ఫైబర్ , ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, లిగ్నన్ ఇతర పోషకాలు, ఖనిజాలతో నిండి ఉంటాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo