బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 22:45:14

ఆరోగ్యానికి ,అందానికీ మేలు చేసే స్ట్రాబెర్రీస్‌

 ఆరోగ్యానికి ,అందానికీ మేలు చేసే స్ట్రాబెర్రీస్‌

హైదరాబాద్:స్ట్రాబెర్రీస్‌ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఇది సీజనల్ ఫ్రూట్. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన చాలా పోషకాలు అందుతాయి. వీటిని అన్ని పండ్ల కంటే తక్కువ మోతాదులో తీసుకుంటారు. వీటిని ఎక్కువగా ఫ్రూట్ సలాడ్స్, ఐస్ క్రీమ్స్‌లో వాడతారు. కొంతమంది వీటిని జ్యూస్ రూపంలో తీసుకుంటుంటారు. స్ట్రాబెరీస్ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చూడగానే నోరూరిస్తూ ఎర్రని రంగులో తియ్య తియ్యగా, కొద్దిగా పులుపుతో చక్కటి ఆకారం కలిగినటువంటి పండు స్ట్రాబెరీ.   స్ట్రాబెరీస్‌ లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె సమస్యలు రావు.

ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్న వయసులోనే గుండె సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గుండె జబ్బులకు ముఖ్య కారణాలైన ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలని స్ట్రాబెరీస్ దూరం చేస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తినడం అలవాటు చేసుకోవాలి. స్ట్రాబెర్రీస్‌లో ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ప్రెగ్నన్సీ మహిళలకు చాలా మంచిది. పుట్టబోయే బిడ్డలో లోపాలు ఏర్పకుండా ఉండాలంటే వీటిని తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి ప్రెగ్నన్సీ మహిళలు వీటిని తీసుకోవడం చాలా మంచిది.స్ట్రాబెరీస్‌ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల కంటి సమస్యలు దూరం అవుతాయి. అంతేకాదు వీటిని తినడం వల్ల ఎముకలు కూడా ఆరోగ్యంగా, దృడంగా మారతాయి. ఇన్ని లాభాలు ఉన్న స్ట్రాబెరీస్‌‌ని సీజనల్ గా దొరికే సమయంలో తినడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇన్ని లాభాలు ఉన్న స్ట్రాబెరీస్‌ని నేరుగా తీసుకోవడం చాలా మంచిది. అయితే ఇష్టం లేని వారు మిల్క్ షేక్స్, సలాడ్స్‌లో వేసుకోని కూడా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల వీటిని తింటే రక్తనాళాల్లో రక్తం గడ్డకుండా ఉంటుంది. ఇది శరీరంలోని అన్ని అవయవాలకు చాలా మంచిది. అంతేకాదు వీటిని తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఇందులోని ప్రత్యేక గుణాలు రక్తంలో చక్కెర శాతం పెరగకుండా చూసుకుంటాయి. తద్వారా మధుమేహం రాకుండా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఫ్లేవనాయిడ్స్, మాంగనీస్ కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి.logo