సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 12:33:27

రివాల్వ‌ర్‌తో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

రివాల్వ‌ర్‌తో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్య‌

జైపూర్: ‌రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో దారుణం జ‌రిగింది. జైపూర్‌లోని సామోద్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న‌‌ శ్రీరామ్ త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. తాను నివాసం ఉంటున్న పోలీస్ క్వార్టర్స్‌లోనే ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు. ఈ ఘటన స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. స‌మాచారం అందిన వెంట‌నే పోలీస్ ఉన్న‌తాధికారులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని తోటి పోలీసుల నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మృతుని దగ్గర ఒక‌ సూసైడ్ నోట్ కూడా లభ్యమయ్యింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమ‌వారం ఉదయం మిగ‌తా సిబ్బంది అంతా విధుల‌కు హాజ‌రైనా హెడ్ కానిస్టేబుల్ శ్రీరామ్ మాత్రం స్టేషన్‌కు రాలేదు. ఫోన్ రింగ‌వుతున్నా లిఫ్ట్ చేయ‌లేదు. దీంతో తోటి పోలీసులు శ్రీరామ్ ఉంటున్న క్వార్టర్స్‌కు వెళ్లి చూడ‌గా అస‌లు విష‌యం వెలుగుచూసింది. దాంతో వారు వెంట‌నే ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం ఇచ్చి శ్రీరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మానసిక‌ ఒత్తిళ్ల‌ను త‌ట్టుకోలేకే త‌ట్టుకోలేకే శ్రీరామ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo