శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 08, 2020 , 14:10:51

పుట్టెడు దుఃఖంలో పైల‌ట్ త‌ల్లిదండ్రులు!

పుట్టెడు దుఃఖంలో పైల‌ట్ త‌ల్లిదండ్రులు!

తిరువ‌నంత‌పురం: కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో జ‌రిగిన విమాన ప్ర‌మాదం ప‌లు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్ర‌మాదంలో విమాన పైల‌ట్, వింగ్ క‌మాండ‌ర్‌ దీపక్ వ‌సంత్ సాథే (59) కూడా ప్రాణాలు కోల్పోవ‌డంతో కురువృద్ధులైన అత‌ని త‌ల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. వృద్ధాప్యంలో తమకు కొండంత ధైర్యంగా ఉన్నాడనుకున్న కొడుకు ఇకలేడన్న వార్త విని వారు త‌ట్టుకోలేక పోతున్నారు. అత‌ని స్మృతుల‌ను త‌లుచుకుంటూ కుమిలికుమిలి ఏడుస్తున్నారు. 

ఈ వృద్ధ దంప‌తులు గ‌తంలో జ‌రిగిన‌ ప్ర‌మాదంలోనే ఒక‌ కొడుకును పోగొట్టుకుని పుత్రశోకం అనుభ‌విస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో ఉన్న మ‌రో కొడుకు కూడా ప్రాణాలు కోల్పోవ‌డంతో వారి క‌డుపు కోత వ‌ర్ణ‌ణాతీతంగా మారింది. నా కొడుకు చాలా గొప్పవాడు. అవసరమైన వారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే వాడు' అంటూ పైల‌ట్‌ తల్లి నీలా సాథే కంట‌త‌డిపెట్టారు. కళ్ల నిండా నీళ్లతో, విషణ్ణ వదనాలతో పైల‌ట్ త‌ల్లిదండ్రులు మీడియాతో చెప్పిన మాటలు విన్న‌వారి హృదయాలను ద్రవింపజేశాయి. 

మరోవైపు కెప్టెన్ సాథేతో తమ అనుబంధాన్ని తలుచుకుంటూ ఆయన అభిమానులు, సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలంటూ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ప్రమాదాన్ని ముందే ప‌సిగ‌ట్టిన కెప్టెన్ సాథే.. ఇంజిన్‌ను ఆపివేసి ప్రయాణీకులు, తోటి సిబ్బంది ప్రాణాలను కాపాడారంటూ కొనియాడుతున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo