బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 15:51:14

నాలుగేండ్లుగా కుటుంబంతో టాయిలెట్‌లో నివసిస్తున్నాడు!

నాలుగేండ్లుగా కుటుంబంతో టాయిలెట్‌లో నివసిస్తున్నాడు!

టీకాంఘర్‌ : మధ్యప్రదేశ్‌రాష్ర్టం టీకాంఘర్‌ జిల్లా మోహన్‌ఘర్‌ ప్రాంతంలోని కేశవ్‌ఘర్‌ గ్రామ పంచాయతీలో ఓ కుటుంబం బాత్‌రూంలో నివసించాల్సి వస్తుంది. పేదలకు గృహనిర్మాణం చేస్తామని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్ధానం చేస్తున్నా అమల్లోకి మాత్రం రావడం లేదని ఆ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికార యంత్రాంగం ఖండించింది.

మగన్‌లాల్ అహిర్‌వార్ అతడి భార్య నలుగురు పిల్లలు వీరంతా నాలుగేళ్లుగా టాయిలెట్‌లో నివసిస్తున్నారు. అహిర్వార్ భార్య పూలాదేవి మాట్లాడుతూ తన కుటుంబానికి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు రాలేదని అధికారులకు విన్నవించినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని తెలిపింది. ఈ జంట తమ కుమార్తెకు ఇదే టాయిలెట్‌లో ఉండి వివాహం కూడా చేశారు. ఉజ్వల పథకం కింద వారికి విద్యుత్ కనెక్షన్‌, గ్యాస్ కనెక్షన్ కూడా వచ్చింది. 

ఈ విషయమై స్థానిక తహసీల్దార్‌ అభిజీత్ సింగ్ మాట్లాడుతూ తాను ఈ కేసు గురించి తెలుసుకున్నానని, అహిర్‌వార్‌కు గ్రామంలో పూర్వీకుల ఇల్లు ఉందని, కానీ అతను టాయిలెట్‌లో నివిస్తున్నట్లు తనకు చెప్పలేదన్నారు. అతడు ఇంతకుముందు మరుగుదొడ్డిలో నివసించి ఉండవచ్చు కానీ ప్రస్తుతం అతను అక్కడ నివసించడం లేదు అని తహసీల్దార్‌ వివరించారు. 



logo