బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 00:36:18

ఉద్యోగుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన హెచ్‌సీసీబీ

  ఉద్యోగుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టిన హెచ్‌సీసీబీ

విజయవాడ: భారతదేశంలో సుప్రసిద్ధ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్‌ కోకా–కోలా బేవరేజస్‌ (హెచ్‌సీసీబీ) కరోనా నేపథ్యంలో తమ ఫ్యాక్టరీలలో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కోవిడ్‌–19 వ్యాప్తిని నిరోధించడానికి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అందులోభాగంగా మానవ స్పర్శను వీలైనంతగా తగ్గించడంతో పాటుగా కోవిడ్‌–19 బారిన పడిన ఉద్యోగులను తక్షణమే గుర్తించి వారిని ఐసోలేట్‌ చేసేందుకు సహాయపడే రీతిలో అమలుచేస్తున్నారు. ఈ చిన్న బృందాలను అత్యంత జాగ్రత్తగా ఏర్పాటుచేశారు.

భారతదేశ వ్యాప్తంగా 15 ప్రాంతాలలోని తమ ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న తమ ఉద్యోగులు , ఇతర భాగస్వాముల , భద్రతకు పూర్తి భరోసానందిస్తూ కంపెనీ పలు భద్రతా చర్యలు చేపట్టింది. ‘‘మా ఉద్యోగులు , భాగస్వాములు సహా వినియోగదారులు, సరఫరాదారులు , కమ్యూనిటీలో ప్రతి ఒక్కరి జీవితాలను మించిన అంశమేమీ లేదని మా కంపెనీలో స్పష్టమైన ఆదేశం ఉంది.  తప్పనిసరిగా ఫేస్‌మాస్క్‌ వినియోగించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, ప్రభుత్వం సూచించిన ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తున్నామని " హెచ్‌సీసీబీ, హెల్త్‌, సేఫ్టీ అండ్‌ వెల్‌నెస్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ జీఎస్‌ రఘు తెలిపారు. logo