ఉమాభారతి పిటిషన్పై జనవరి 6న విచారణ

అలహాబాద్ : ప్రభుత్వ ఉద్యోగి తన విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారనే ఆరోపణలపై 2012లో తనపై ప్రారంభించిన క్రిమినల్ చర్యలను సవాల్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు వచ్చే ఏడాది జనవరి 6న విచారించనుంది. ఈ ఏడాది అక్టోబర్ 17న హైకోర్టు చట్ట ప్రకారం విచారణను కొనసాగించాలని దిగువ కోర్టును ఆదేశించింది. 2012లో మహాబాలోని చార్ఖారీలో జరిగిన రాజకీయ కార్యక్రమంలో ఉమా భారతి, ఆమె మద్దతుదారులు ఓ ప్రభుత్వ ఉద్యోగిని తన విధులను నిర్వర్తించకుండా బలవంతంగా ఆపి, నిషేధ ఉత్తర్వులు ఉల్లంఘించారని ఆరోపించారు. బీజేపీ నాయకురాలితో పాటు మరో ఆరుగురు దాఖలు చేసిన పిటిషన్పై జనవరి 6న లిస్ట్ చేస్తూ జస్టిస్ సునీత్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజకీయ వైరంతోనే తనపై, మద్దతుదారులు కేసులో తప్పుగా చిక్కుకున్నామని పిటిషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
- రద్దు చేసిన రైళ్ల పునరుద్ధరణ
- మేడారం మినీ జాతరకు ప్రత్యేక బస్సులు
- అంగన్వాడీల సేవలు మరింత విస్తరణ
- దేశంలోనే తెలంగాణ పోలీస్ అగ్రగామి
- మామిడి విక్రయాలు ఇక్కడే
- దేశవ్యాప్తంగా ‘డిక్కీ’ని విస్తరిస్తాం
- కొత్తపుంతలు తొక్కుతున్న వస్త్రపరిశ్రమ
- మాల్దీవులలో చిల్ అవుతున్న యష్ ఫ్యామిలీ
- ‘ఐసెట్ కౌన్సెలింగ్పై రెండ్రోజుల్లో తేల్చండి’
- రూ.19 కోట్లు.. 5 కి.మీ.