గురువారం 02 జూలై 2020
National - Jun 24, 2020 , 15:09:51

కేంద్రం, ఆప్‌ సర్కారుకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

కేంద్రం, ఆప్‌ సర్కారుకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభం నేపథ్యంలో పీపీఈ కిట్లు, ఫేస్‌మాస్కుల ఎగుమతిపై కేంద్రం విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కేంద్రం, ఢిల్లీ సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మంగళవారం జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవ నేతృత్వంలోని ధర్మాసనం  విదేశీ వ్యవహారాలు, వాణిజ్య మంత్రిత్వశాఖలు, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌తో పాటు ఢిల్లీ ప్రభుత్వం నుంచి స్పందన కోరుతూ విచారణను జులై 10వ తేదీకి విచారణను వాయిదా వేసింది. కేంద్రం విధించిన ఆంక్షలతో కార్మికులకు నష్టం వాటిల్లిందని థాంప్సన్‌ ప్రెస్‌ సర్వీసెస్‌ సంస్థ  పిటిషన్‌లో పేర్కొంది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో కొరతను నివారించేందుకు ఎగుమతులపై నిషేధం విధించినట్లు అదనపు సొలిసిటర్ జనరల్ మనీందర్ ఆచార్య కేంద్రం తరఫున కోర్టుకు విన్నవించారు. దేశంలో కొనుగోలుదారుల కొరత లేదనీ, అయితే పిటిషనర్‌తో పాటు తయారీదారులు లాభాలు ఆర్జించేందుకు ఎగుమతి చేయాలనుకుంటున్నారని వాదించారు. పీపీఈ కిట్ల ఎగుమతితో జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడంతో పాటు ఎంఎస్‌ఎంఈ రంగం పునరుద్ధరణకు దోహదపడుతుందని, విదేశాల్లో భారత్‌ స్నేహపూర్వక సంబంధాలకు కూడా దోహదం చేస్తున్నందని పిటిషనర్‌ వాదించారు.


logo