శుక్రవారం 03 జూలై 2020
National - Feb 03, 2020 , 00:48:04

ఉరి జాప్యానికి యత్నం

ఉరి జాప్యానికి యత్నం
  • నిర్భయ కేసులో దోషుల తీరుపై కేంద్రం

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషులు ఉద్దేశపూర్వకంగా ఉరిశిక్ష అమలును జాప్యం చేసేందు కు ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ హైకోర్టుకు కేం ద్రం తెలిపింది. దోషులు  చట్టాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్రం తరఫున ఆదివారం విచారణకు హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా చెప్పారు. ఈ కేసు లో దోషి పవన్‌ గుప్తా కావాలనే సుప్రీంకోర్టులో క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయడం గానీ, రాష్ట్రపతికి క్షమాభిక్ష కోసం దరఖాస్తు గానీ చేయలేదని తుషార్‌ మెహతా నివేదించా రు. న్యాయ వ్యవస్థతో ఆటలాడుతూ, జాతి సహనానికి పరీక్ష పెడుతున్నారని ఆరోపించారు. దోషి ముకేశ్‌ కుమార్‌ (32) తరఫున విచారణకు హాజరైన రెబెకా జాన్‌ వాదిస్తూ.. కేంద్రం పిటిషన్‌కు విచారణ అర్హతే లేదన్నా రు. దిగువ కోర్టులో కేసు విచారణ ప్రక్రియ లో ఏనాడూ పాల్గొనని కేంద్రం.. కేవలం 2 రోజుల క్రితం నిద్ర నుంచి మేల్కొని.. దోషులకు శిక్ష అమలులో జాప్యం జరుగుతున్నదని ఆరోపిస్తున్నదన్నారు. ఈ కేసులో దోషులకు శిక్ష అమలు కోసం బాధితురాలి తల్లిదండ్రు లు దిగువ కోర్టును ఆశ్రయించినప్పుడు తక్ష ణం డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని కేంద్రం గానీ, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం గానీ కోరలేదని గుర్తు చేశారు.  ఒక దోషి  పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా, ఇతర దోషులను ఉరితీయవచ్చునా? అని సుప్రీంకోర్టును కేం ద్రం స్పష్టత కోరిందని రెబెకా హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఇతర దోషుల తరఫున విచారణకు హాజరైన న్యాయవాది ఏపీ సింగ్‌.. ఢిల్లీ దిగువకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కేంద్రం దాఖ లు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకించారు.


logo