మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 19:13:03

ప్లాస్మా ఇవ్వాల‌ని ఎదురుచూస్తున్నా: ఎంపీ సుమ‌ల‌త‌

ప్లాస్మా ఇవ్వాల‌ని ఎదురుచూస్తున్నా: ఎంపీ సుమ‌ల‌త‌

బెంగ‌ళూరు: ప‌్ర‌ముఖ న‌టి, క‌ర్ణాట‌క ఎంపీ సుమ‌ల‌త అంబ‌రీష్ తాను ప్లాస్మా దానం చేయ‌డం కోసం ఎదురు చూస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. తాను క‌రోనా మ‌హ‌మ్మారి బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని, ప్లాస్మా దానం చేసేందుకు డాక్ట‌ర్ల అనుమ‌తి కోసం ఎదురుచూస్తున్నాన‌ని ఆమె తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత‌ 28 రోజులపాటు తాము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, ఆ తర్వాత‌ యాంటీజెన్ టెస్ట్ ద్వారా శరీరంలోని ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ స్థాయిని నిర్థారించాల్సి ఉందని సుమ‌ల‌త‌ చెప్పారు. ఒకవేళ శరీరంలో యాంటీబాడీస్ అధికంగా ఉంటే ప్లాస్మా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నాన‌ని ఆమె పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo