ఆదివారం 12 జూలై 2020
National - Jun 22, 2020 , 14:31:38

కొవిడ్-19 విధుల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు

కొవిడ్-19 విధుల్లో ఎంబీబీఎస్ విద్యార్థులు

న్యూఢిల్లీ : హ‌ర్యానా రాష్ర్టంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ ను నియంత్రించేందుకు ఆ రాష్ర్ట ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఎంబీబీఎస్ ఫైన‌లియ‌ర్ చ‌దువుతున్న విద్యార్థుల‌ను కూడా విధుల్లోకి తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. 

రాష్ర్టంలోని 11 ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు వైద్య క‌ళాశాల‌ల్లో చ‌దువుతున్న 1,106 మంది విద్యార్థుల‌ను త‌క్ష‌ణ‌మే విధుల్లోకి తీసుకోవాల‌ని సంబంధిత జిల్లాల సివిల్ స‌ర్జ‌న్ల‌కు ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు హ‌ర్యానా వైద్య విద్య‌, ప‌రిశోధ‌న డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. అయితే ఎంబీబీఎస్ ఫైన‌లియ‌ర్ విద్యార్థులంద‌రికీ.. మెడిక‌ల్ కాలేజీల డైరెక్ట‌ర్లు, సివిల్ స‌ర్జ‌న్లు అవ‌స‌ర‌మైన శిక్ష‌ణ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. 

హ‌ర్యానాలో ఇప్ప‌టి వ‌ర‌కు 10,635 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 160 మంది చ‌నిపోయారు. గురుగ్రామ్ లో అత్య‌ధికంగా 4,427, ఫ‌రీదాబాద్ లో 2,237, సోనిప‌ట్ లో 866, రోహ‌త‌క్ లో 427, అంబ‌లాలో 273 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 


logo