సోమవారం 18 జనవరి 2021
National - Dec 05, 2020 , 11:39:10

వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి క‌రోనా పాజిటివ్‌..

వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి క‌రోనా పాజిటివ్‌..

హైద‌రాబాద్‌:  హ‌ర్యానా ఆరోగ్య‌శాఖ‌ మంత్రి అనిల్ విజ్ కొన్ని రోజుల క్రితం క‌రోనా వైర‌స్ టీకా ట్ర‌య‌ల్స్‌లో భాగంగా టీకాను వేయించుకున్నారు. అయితే ఆ మంత్రికి వైర‌స్ సోకింది.  ఇవాళ ఉద‌యం త‌న ట్విట్ట‌ర్‌లో మంత్రి అనిల్ విజ్ ఈ విష‌యాన్ని తెలిపారు.  కోవిడ్‌19 ప‌రీక్ష‌లో పాజిటివ్ తేలిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.  వాస్త‌వానికి న‌వంబ‌ర్ 20వ తేదీన మంత్రి అనిల్‌.. కోవాగ్జిన్ టీకాను తీసుకున్నారు.  అంబాలా హాస్పిట‌ల్‌లో జ‌రిగిన మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్స్‌లో భాగంగా మంత్రి అనిల్ విజ్.. వాలంటీర్ రూపంలో వ్యాక్సిన్ తీసుకున్నారు.  హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్‌బ‌యోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న విష‌యం తెలిసిందే.