మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 13:50:43

రాజస్థాన్‌ సంక్షోభంలో మా పాత్ర లేదు : హర్యానా హోం మంత్రి

రాజస్థాన్‌ సంక్షోభంలో మా పాత్ర లేదు : హర్యానా హోం మంత్రి

అంబాలా : రాజస్థాన్‌ సంక్షోభంలో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఉందని, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బందీలుగా ఉంచారన్న ఆరోపణలను ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్‌ విజ్‌ ఖండించారు. ‘రాజస్థాన్‌ రాజకీయ ఘటనల్లో హర్యానాకు ఎలాంటి పాత్ర లేదు. ఎవరినీ బందీలుగా ఉంచలేదు. గవర్నర్‌ తాను అనుకున్న పని చేస్తే బాగుటుందని అన్నారు. ఆయన ఒత్తిడికి లోను కాలేరు. అందుకే ఈ సమయంలో అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయలేమని భావిస్తే.. అప్పుడు సమావేశాన్ని పిలవకూడదు’ అని విజ్‌ పేర్కొన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ పరిస్థితి, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వంటి పలు అంశాలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గెహ్లాట్ డిమాండ్ చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, సీఎం గెహ్లాట్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో రాజస్థాన్ రాజకీయ సంక్షోభంలో పడింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo