శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 20, 2020 , 17:14:36

హ‌ర్యానాలో న‌వంబ‌ర్ 30 దాకా బ‌డులు బందే

హ‌ర్యానాలో న‌వంబ‌ర్ 30 దాకా బ‌డులు బందే

చంఢీగ‌డ్‌: హ‌ర్యానాలో న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు బడులు బందే ఉంటాయ‌ని అక్క‌డి ప్ర‌భుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌లను న‌వంబ‌ర్ 30 వ‌ర‌కు మూసే ఉంచాల‌ని ఆదేశించిన‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు హ‌ర్యానా స‌ర్కారు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. హ‌ర్యానాలో క‌రోనా పాజిటివ్ కేసుల ప్ర‌భావం ఇంకా త‌గ్గ‌క‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్న‌ది. కాగా, హ‌ర్యానాలో గురువారం కూడా కొత్త‌గా 2,212 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య రెండు ల‌క్ష‌ల మార్కును దాటి 2,09,251కి చేరింది. అదేవిధంగా గురువారం కొత్త‌గా 20 మంది మృతిచెంద‌డంతో మొత్తం మృతుల సంఖ్య 2,113కు పెరిగింది.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.