హర్యానా : ఓ ‘గే’ దారుణానికి పాల్పడ్డాడు. లింగ మార్పిడికి డబ్బులివ్వలేదని కుటుంబాన్నే హత్య చేశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని రోహతక్‌లో ఆగస్టు 27న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. అభిషేక్ అనే యువకుడు గే. ఈ క్రమంలో తాను అంగ మార్పిడి చేయించుకుంటానని, తనకు రూ. 5 లక్షలు కావాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు. కానీ డబ్బులు ఇచ్చేందుకు అతని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
దీంతో తన పార్ట్నర్తో కలిసి తల్లిదండ్రులతో పాటు చెల్లి, నానమ్మను చంపాలని ప్లాన్ చేశాడు. ఆగస్టు 27వ తేదీ రాత్రి ఆ నలుగురిని తుపాకీతో కాల్చి, వారిపై ఉన్న బంగారు ఆభరణాలను అభిషేక్ దొంగిలించి పారిపోయాడు. ఈ కేసులో ఆగస్టు 31న పోలీసులు అభిషేక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.