శనివారం 23 జనవరి 2021
National - Jan 04, 2021 , 11:54:08

జనరల్‌ డయ్యర్‌లా సీఎం ఖట్టర్‌

జనరల్‌ డయ్యర్‌లా సీఎం ఖట్టర్‌

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల పట్ల హర్యానా ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నదని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ ఛద్దా అన్నారు. సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులపై లాఠీ చార్జీ, భాష్పవాయు గోళాల ప్రయోగానికి అనుమతిస్తూ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్ జనరల్‌ డయ్యర్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రైతులు దేశానికి ఏమైనా శత్రువులా? వాళ్లేమైనా చైనా లేదా పాకిస్థాన్‌ సైనికులా? అని ప్రశ్నించారు. ఇది సిగ్గుపడాల్సిన విషమని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గత 40 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు తమ ఉద్యమం ఆపేది లేదని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం వారి డిమాండ్ల పట్ల సానుకూలత ప్రదర్శించడం లేదు. ఇరు పక్షాల మధ్య ఇప్పటికే ఆరుసార్లు చర్చలు జరిగాయి. అయితే వాటిలో ఆశించన ఫలితాలు మాత్రం రాలేదు. దీంతో సోమవారం మరోమారు రైతు సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరుపనుంది. కాగా, ఆందోళనల్లో పాల్గొన్న రైతుల్లో ఇప్పటివరకు 60 మంది మరణించారని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. ప్రతి 16 గంటలకు ఒకరిచొప్పున మృతిచెందుతున్నారని భారతీయ కిసాన్‌ సంఘం నేతలు తెలిపారు. 


logo