మంగళవారం 14 జూలై 2020
National - Jun 18, 2020 , 18:08:43

కరోనా పరీక్షలకు మొబైల్‌ ల్యాబోరేటరీలు

కరోనా పరీక్షలకు మొబైల్‌ ల్యాబోరేటరీలు

న్యూఢిల్లీ  : దేశంలోని పలు రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలు, అంతర్గత గ్రామాల్లో కరోనా పరీక్షల నిర్వహణకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ గురువారం మొబైల్‌ ల్యాబోరేటరీలు ప్రారంభించారు.  ఈ ల్యాబోరేటరీలకు రోజులకు 25 ఆర్టీ- పీసీఆర్‌ పరీక్షలు, 300 ఏలీసా పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని  తెలిపారు. వీటిలో కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు టీబీ, హెచ్‌ఐవీ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతర్గత గ్రామాల్లోని వారికి కరోనా పరీక్షలు చేసేందుకు కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. దేశంలో  కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు ఫిబ్రవరిలో ఒక్క ల్యాబోరేటరీ మాత్రమే అందుబాటులో ఉండగా ఇప్పుడు 953 అందుబాటులో ఉన్నాయని, వీటిలో 699 ప్రభుత్వ ఆధీనంలోనివేనని వెల్లడించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ,  ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్‌ సహకారంతో దేశంలో క్లిష్టమైన ఆరోగ్య సాంకేతికత కొరతను అధిగమించి స్వయం సమృద్ధివైపు పయణిస్తామన్నారు.   logo