శుక్రవారం 05 జూన్ 2020
National - May 23, 2020 , 01:35:54

డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా హర్షవర్ధన్‌

డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా హర్షవర్ధన్‌

బాధ్యతలు స్వీకరించిన కేంద్రమంత్రి

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లాడుతూ విశ్వమారి వల్ల తలెత్తిన ప్రస్తుత సంక్షోభ పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో వివిధ దేశాల భాగస్వామ్యాన్ని  బలోపేతం చేస్తామన్నారు. ఈ పదవిలో ఆయన ఏడాది పాటు కొనసాగుతారు.  


logo