బుధవారం 03 జూన్ 2020
National - Apr 10, 2020 , 15:21:15

రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో హర్ష వర్దన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో హర్ష వర్దన్‌ వీడియో కాన్ఫరెన్స్‌


ఢిల్లీ : కరోనాపై అన్ని రాష్ర్టాల ఆరోగ్యశాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్‌ నేడు వీడియో కాన్పరెన్స్‌ను నిర్వహించారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్‌ చౌబేతో కలిసి ఢిల్లీలోని నిర్మాణ్‌ భవన్‌ నుంచి హర్షవర్దన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ర్టాల్లో ప్రస్తుత పరిస్థితులు, కరోనా కట్టడి చర్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కరోనా చైనా నుంచి మిగిలిన దేశాలకు విస్తరించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా 212 దేశాలకు వ్యాపించిందన్నారు. కరోనాపై యుద్ధానికి అందరూ సహకరిస్తున్నారన్నారు. కరోనాకు సరిహద్దులంటూ ఏమీ లేవన్నారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ తయారీకి ప్రయోగాలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కొన్ని రాష్ర్టాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందన కేంద్ర మంత్రి అందరూ మాస్కులు ధరించడం అత్యంత ప్రధానం అన్నారు.


logo