శుక్రవారం 03 జూలై 2020
National - Jan 24, 2020 , 17:06:08

రాజీనామా ఉపసంహరించుకున్న ఆప్‌ ఎమ్మెల్యే..

 రాజీనామా ఉపసంహరించుకున్న  ఆప్‌ ఎమ్మెల్యే..

పార్టీ తనకు టికెట్‌ కేటాయించలేదని ఆప్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జగదీప్‌ సింగ్‌ ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్యే జగదీప్‌సింగ్‌ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

న్యూఢిల్లీ: పార్టీ తనకు టికెట్‌ కేటాయించలేదని ఆప్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే జగదీప్‌ సింగ్‌ ఇటీవలే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్యే జగదీప్‌సింగ్‌ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సలహా మేరకు తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు జగదీప్‌సింగ్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీతో ఉండటమే మంచిదనిపించింది. ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ పార్టీలోనే ఉండాలని నాకు సలహా ఇచ్చారు. గత కొన్నేళ్లుగా మేం మంచి పనులు చేస్తున్నాం. నేను పార్టీలోనే కొనసాగుతానని జగదీప్‌ సింగ్‌ స్పష్టం చేశారు.   హరినగర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీప్ సింగ్ స్థానంలో రాజ్ కుమారి థిల్లాన్ కు పోటీ చేసే అవకాశం ఇచ్చారు కేజ్రీవాల్. 


logo