మంగళవారం 19 జనవరి 2021
National - Jan 03, 2021 , 12:30:18

మా శ్ర‌మ ఫ‌లించింది.. హ్యాపీ న్యూ ఇయ‌ర్‌

మా శ్ర‌మ ఫ‌లించింది.. హ్యాపీ న్యూ ఇయ‌ర్‌

పుణె:  కొవిషీల్డ్ వ్యాక్సిన్‌కు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇవ్వ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేశారు సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) సీఈవో అద‌ర్ పూనావాలా. కొవిషీల్డ్‌తోపాటు హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి కూడా డీసీజీఐ అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన త‌ర్వాత హ్యాపీ న్యూ ఇయ‌ర్ అంటూ అద‌ర్ ట్వీట్ చేశారు. వ్యాక్సిన్‌ను నిల్వ చేయ‌డానికి సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప‌డిన శ్ర‌మ‌కు ఇప్పుడు ఫ‌లితం ల‌భించింది. కొవిషీల్డ్ ఇండియాలో అనుమ‌తి పొందిన తొలి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌. సుర‌క్షిత‌మైన ఈ వ్యాక్సిన్ వ‌చ్చే కొన్ని వారాల్లో అందుబాటులోకి వ‌స్తుంది అని అద‌ర్ ట్వీట్ చేశారు.