గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 15, 2020 , 18:33:48

రంగోలీలో మదర్‌థెరిసాతోపాటు సోనూసూద్‌ చిత్రాలు..

రంగోలీలో మదర్‌థెరిసాతోపాటు సోనూసూద్‌ చిత్రాలు..

రాజ్‌కోట్‌: ఉత్తరభారతదేశంలో రంగోలీ.. దీపావళిలో అంతర్భాగం. ప్రతి ఇంటిలో ఒక ప్రత్యేకమైన డిజైన్‌ను గీస్తారు. ఇంటి గుమ్మాలకు అందమైన రంగులు వేస్తారు. రాజ్‌కోట్‌లోని ఒక ఆర్ట్‌ గ్యాలరీలో 70 మంది ప్రముఖుల చిత్రాలను రంగోలీలో భాగంగా గీశారు. ఇందులో నోబెల్‌శాంతి బహుమంతి గ్రహీత మదర్‌థెరిసాతోపాటు సోనూసూద్‌ చిత్రం కూడా ఉండడం విశేషం.

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌.. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ఎంతోమంది వలసకూలీలకు అండగా నిలిచారు. దేశవ్యాప్తంగా నిరుపేదలను ఆదుకుంటున్నారు. ఇప్పటికీ తన సేవాతత్పరతను చాటుతున్నారు. దీంతో ఆయన ప్రముఖ వ్యక్తిగా మారిపోయారు. ఈ ఆర్ట్‌ గ్యాలరీలో వీరితోపాటు గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీ, హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ రమ్యకృష్ణ చిత్తరువులను కూడా రంగోలీలో భాగంగా గీశారు.   


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.