బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 13:11:09

థాంక్యూ..మై గ్రేట్‌ ఫ్రెండ్‌ మోదీ

థాంక్యూ..మై గ్రేట్‌ ఫ్రెండ్‌ మోదీ

అహ్మదాబాద్‌:  సబర్మతి   ఆశ్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ దంపతులు సందర్శించారు.  ఆశ్రమ విశిష్టత, గాంధీ అనుసరించిన జీవన విధానాన్ని ఈ సందర్భంగా ట్రంప్‌ దంపతులకు మోదీ వివరించారు.  అనంతరం సబర్మతీ ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో ట్రంప్‌ సందేశం రాసి సంతకం చేశారు.  అద్భుతమైన ఆతిథ్యానికి ప్రియమిత్రుడు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలంటూ  ట్రంప్‌  పుస్తకంలో పేర్కొన్నారు.

'గొప్ప స్నేహితుడైన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు. అద్భుతమైన సందర్శన ఇది.' అని  పుస్తకంలో రాసుకొచ్చారు.  అనంతరం సబర్మతి ఆశ్రమం నుంచి మొతెరా స్టేడియంలో జరగనున్న నమస్తే ట్రంప్‌ కార్యక్రమంలో హాజరయ్యేందుకు ట్రంప్‌ దంపతులు, మోదీ వెళ్లారు.  రోడ్డు పొడువునా సాంస్కృతిక కార్యక్రమాలతో ట్రంప్‌ ఘన స్వాగతం పలుకుతున్నారు. logo
>>>>>>