బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 18, 2020 , 15:51:12

ఒక్కొక్క ఉరికి 20 వేల పారితోషికం

ఒక్కొక్క ఉరికి 20 వేల పారితోషికం

న్యూఢిల్లీ : నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు తీహార్‌ జైల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం నమూనా ఉరిని అమలు చేసి చూశారు. నలుగురు నిందితుల బరువుకు సమానంగా ఉన్న వేర్వేరు ఇసుక బస్తాలను ఉరికి ఉపయోగించి ట్రయల్స్‌ నిర్వహించారు. ఎనిమిది మనీలా తాళ్లను సిద్ధంగా ఉంచారు. నమూనా ఉరికి అర గంట సమయం పట్టినట్లు జైలు అధికారులు తెలిపారు.

మీరట్‌ నుంచి తలారీ పవన్‌ జల్లాద్‌ మంగళవారం తీహార్‌ జైలుకు చేరుకున్నాడు. పవన్‌ తీహార్‌ జైలుకు రావడం ఇది నాలుగోసారి. జైలు నంబర్‌ 3లో ఉన్న పవన్‌కు భారీ భద్రత కల్పించారు జైలు అధికారులు. నలుగురు నిందితులను ఉరి తీస్తున్నందుకు గానూ పవన్‌కు రూ. 20 వేల చొప్పున పారితోషికం ఇవ్వనున్నారు. నిర్భయ నిందితులు ముకేష్‌ కుమార్‌ సింగ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ కుమార్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌ను మార్చి 20న తెల్లవారుజామున 5:30 గంటలకు ఉరి తీయనున్నారు.


logo
>>>>>>