శనివారం 28 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 16:29:34

‘నా తండ్రి మరణంపై దర్యాప్తు కోరడం రాజకీయమే..’

‘నా తండ్రి మరణంపై దర్యాప్తు కోరడం రాజకీయమే..’

పాట్నా: తన తండ్రి మరణంపై దర్యాప్తు చేయాలని కోరడం రాజకీయం కోసమేనని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ విమర్శించారు. కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణంపై దర్యాప్తు జరుపాలని హిందూస్థానీ అవామ్ మోర్చా (హె‌చ్‌ఏఎం) పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం లేఖ రాసింది. దళిత నేత రామ్‌ విలాస్‌ మరణాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నా ఆయన కుమారుడు చిరాగ్‌ నవ్వుతూ కనిపించారని, తండ్రి మరణించిన రెండు రోజులకే షూటింగ్స్‌లో పాల్గొన్నారని, దీంతో పలు అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించింది. రామ్ విలాస్‌ ఆరోగ్యంపై ఎయిమ్స్‌ దవాఖాన హెల్త్‌ బులిటెన్‌ ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించింది. 

మరోవైపు హె‌చ్‌ఏఎం పార్టీ చేసిన ఈ ఆరోపణలపై చిరాగ్‌ మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తిపై ప్రతి ఒక్కరు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా మాట్లాడానికి వారు సిగ్గుపడాలని విమర్శించారు. తన తండ్రి గురించి మంజి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని చిరాగ్‌ మండిపడ్డారు. ఆయన బతికి ఉన్నప్పుడు, దవాఖానలో ఉన్నప్పుడు ఎవరూ కూడా ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. తన తండ్రి పాశ్వాన్‌ ఆరోగ్య పరిస్థితి గురించి మంజిజీకి ఫోన్‌ చేసి చెప్పినా కూడా ఆయన ఎప్పుడూ  కలవలేదని ఆరోపించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ మంగళవారం జరుగనున్న తరుణంలో రాజకీయ దురుద్దేశంతోనే మంజికి చెందిన హె‌చ్‌ఏఎం పార్టీ ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాసిందంటూ మండిపడ్డారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.