కరోనా సోకిన బ్రిటన్ ప్రయాణికుల్లో సగం మందిలో కొత్త రకం వైరస్?

న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన విమాన ప్రయాణికుల్లో పలువురికి కరోనా సోకగా వీరిలో సగం మందిలో కొత్త రకం వైరస్ జాడ ఉండవచ్చని జన్యు నిఫుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికులకు పలు విమానాశ్రయాల్లో కరోనా పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే వీరిలో గుర్తించిన కరోనా వైరస్ నమూనాలు బ్రిటన్‌లోని కొత్త రకం కరోనా సోకిన 60 శాతం పాజిటివ్ కేసుల మాదిరి ఉన్నట్లుగా తెలుస్తున్నది.
ఈ లెక్క ప్రకారం 20 పాజిటివ్ కేసుల్లో సగం అంటే సుమారు పది మందికి బ్రిటన్‌లోని కొత్త రకం కరోనా సోకి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు హైదరాబాద్‌లోని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. అయితే బ్రిటన్ నుంచి నెలల ముందు వచ్చిన వారికి ఇప్పుడు కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వారిలో ఇప్పటి వరకు కరోనా లక్షణాలు ఉండకపోవచ్చని, ఇప్పటికే కొందరి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించి ఉండవచ్చని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- కుల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
- జైలు నుంచి శశికళ విడుదల
- ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్, ఖలీస్తానీలు : కర్ణాటక మంత్రి
- షాకయ్యే చరిత్ర 'ఆపిల్'ది
- రైతుల నిరసనను ఖండించిన మాయావతి
- బోల్తాపడ్డ డీసీఎం.. 70 గొర్రెలు మృతి
- కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్న కమలా హ్యారిస్
- నేడు ఉద్యోగ సంఘాలతో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ
- 22 ఏళ్లు..18 సార్లు...