బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 07:47:20

పదేండ్లలో సగం మంది భారత్‌ ఐటీ నిపుణులు ‘ఏఐ’లో నిష్ణాతులు : మైక్రోసాఫ్ట్‌

పదేండ్లలో సగం మంది భారత్‌ ఐటీ నిపుణులు ‘ఏఐ’లో నిష్ణాతులు : మైక్రోసాఫ్ట్‌

న్యూఢిల్లీ: భారతదేశంలోని ఐటీ నిపుణుల్లో సగం మంది వచ్చే ఆరు నుంచి పదేండ్లలో కృత్రిమ మేధస్సు (ఏఐ)లో నిష్ణాతులవుతారని మైక్రోసాఫ్ట్‌ నిర్వహించిన సర్వేలో తేలింది. భారత్‌లో కృత్రిమ మేధస్సు టెక్నాలజీతో పనిచేస్తున్న సంస్థలన్నీ తమ సిబ్బందిలో నైపుణ్యాన్ని పెంపొందించడంలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నది. ‘ఏఐ’తో తమ బిజినెస్‌ లబ్ధి పొందుతున్నదని ఆయా సంస్థలకు చెందిన 93 శాతం మంది సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు వెల్లడించారు. భారత్‌తోపాటు 19 దేశాల్లో ‘ఏఐ’లో శిక్షణపై మైక్రోసాఫ్ట్‌ ఈ అధ్యయనం జరిపింది.

మైక్రోసాఫ్ట్‌ ఇండియా నేషనల్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ డాక్టర్‌ రోహిణి శ్రీవత్స మాట్లాడుతూ ‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు ఏఐ గుండెకాయ వంటిది. అసాధారణ రీతిలో దూసుకెళ్తున్నది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐటీ బిజినెస్‌లో ఏఐ కీలక పాత్ర పోషించనున్నది’ అని వ్యాఖ్యానించారు. భారత్‌లోని 98 శాతం ‘ఏఐ’ సారథ్య ఐటీ సంస్థల్లోని 85 శాతం మంది భారతీయ ఉద్యోగులు నైపుణ్యం పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారని మైక్రోసాఫ్ట్‌ సోమవారం విడుదల చేసిన అధ్యయన నివేదిక తెలిపింది. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి ఉద్యోగుల వరకు అందరూ నైపుణ్యాభివృద్ధితో నేరుగా సంబంధం కలిగి ఉన్నారు. 


తాజావార్తలు


logo