గురువారం 28 మే 2020
National - May 23, 2020 , 17:04:49

ఆరెంజ్‌ జోన్‌లోకి సగం ఢిల్లీ!

ఆరెంజ్‌ జోన్‌లోకి సగం ఢిల్లీ!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ త్వరలో ఆరెంజ్‌ జోన్‌లోకి రానుంది. ఢిల్లీలో ప్రస్తుతం 92 యాక్టివ్‌ కంటైన్‌మెంట్‌ జోన్లుగా ఉన్నాయి. ఇందులో సగం జోన్లలో గత 14 రోజులుగా కొత్తగా ఒక్క కేసుకూడా నమోదవలేదు. దీంతో ఈ ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్లుగా అధికారులు ప్రకటించారు. మరో 15 రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇవన్నీ గ్రీన్‌జోన్లుగా మారనున్నాయని తెలిపారు. 

దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ర్టాల్లో ఢిల్లీ ఒకటి. ఇక్కడ 126 ప్రాంతాలు కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్నాయి. అయితే కరోనా కేసులు లేకపోవడంతో ఇప్పటికే వీటిలో 34 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్ల నుంచి తప్పించారు. దీంతో ప్రస్తుతం ఢిల్లీలో 94 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. ఇక్కడ రెండువారాలుగా కేసులు నమోదవడంలేదు. వచ్చే రెండు వారాల్లో కూడా కొత్తగా కేసులు నమోదు కానట్లయితే, ఇక్కడ ఉన్న 2.5 లక్షలకు పైగా జనాభా సాధారణ జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది.


logo