నువ్వు ఆడదానవు కాకుంటేనా.. అధికారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆగ్రహం..వీడియో

భోపాల్: మధ్యప్రదేశ్‌లో వారం రోజుల వ్యవధిలోనే మహిళల విషయంలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు నోరుజారారు. గత గురువారం మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సజ్జన్ సింగ్ వర్మ బాలికలు 15 ఏండ్లకే పిల్లలను కనగలరు. అలాంటప్పుడు పెండ్లి వయసును 18 నుంచి 21 ఏండ్లకు ఎందుకు పెంచాలి అని ప్రశ్నించి ప్రజల్లో విమర్శలపాలయ్యారు. ఈ ఘటనను మరువకముందే తాజాగా మరో కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్ తన నోటి దురుసును ప్రదర్శించారు.
హర్ష్ విజయ్ రత్లాం జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కామిని ఠాకూర్‌పై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా రత్లాంలోని సైలాన పట్టణంలో కాంగ్రెస్ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించింది. అనంతరం ఎమ్మెల్యే హర్ష్ విజయ్ నేతృత్వంలో వందలమంది ఆందోళనకారులు వినతిపత్రం సమర్పించేందుకు సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లారు.
అయితే, వారి నుంచి వినతిపత్రం స్వీకరించేందుకు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ చాలాసేపు వెయిట్ చేయించడంతో ఎమ్మెల్యే హర్ష్ విజయ్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. 'నువ్వు ఆడదానవు అయిపోయావు. ఆడదానవు కాకుంటేనా నీ గల్లా పట్టుకుని లాక్కొచ్చి వినతిపత్రం ఇచ్చేవాడిని' అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అధికారిణిపట్ల దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
मध्यप्रदेश @INCMP @INCIndia विधायक हर्ष विजय गहलोत SDM कामिनी ठाकुर को सरेआम धमकी देते हुए कह रहे हैं कि आप महिला हैं, अगर आप महिला नहीं होती तो कॉलर पकड़ कर ज्ञापन देता @ndtv @ndtvindia @GargiRawat @RajputAditi pic.twitter.com/xFamVNucH6
— Anurag Dwary (@Anurag_Dwary) January 18, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.