శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 22, 2020 , 09:05:02

క‌రోనా ఆస్ప‌త్రిగా జైలు వార్డు

క‌రోనా ఆస్ప‌త్రిగా జైలు వార్డు

గువాహ‌టి: గువాహటి సెంట్రల్ జైల్లోని ఒక‌ వార్డును క‌రోనా ఆస్పత్రిగా మార్చారు. అసోం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. గువాహ‌టి సెంట్ర‌ల్ జైలుకు చెందిన ప‌లువురు ఖైదీలు క‌రోనా బారిన ప‌డ‌టంతో క‌రోనా కేర్ సెంట‌ర్ల‌లో చేర్చారు. అయితే వారిలో ఇద్ద‌రు ఖైదీలు ఇటీవ‌ల త‌ప్పించుకుని పారిపోయారు. ఈ నేపథ్యంలో గువాహటి సెంట్రల్ జైలులోనే ఒక‌ వార్డును కొవిడ్ ఆస్ప‌త్రిగా మార్చాలని అధికారులు నిర్ణయించారు. 

కాగా, గువాహ‌టి సెంట్ర‌ల్ జైలులో క‌రోనా రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ది. పౌరసత్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్యతిరేకంగా పోరాడిన కేసులో జైల్లో ఉన్న‌ అఖిల్ గొగోయ్, అతని అనుచ‌రులు కొంద‌రికి క‌రోనా సోకింది. ఆ జైలులోని మణిపూర్ ఉగ్రవాద నాయకులు కూడా క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలో జైలులోని ఒక వార్డును కొవిడ్ ఆస్ప‌త్రిగా మార్చి అందులో వైద్యులు, పారామెడిక‌ల్ సిబ్బందిని కూడా నియ‌మించారు. 

అసోంలో మొత్తం 31 జైళ్లు ఉండగా అన్ని జైళ్ల‌లో క‌లిపి 481 మంది ఖైదీలకు కరోనా సోకింది. గువాహటి సెంట్ర‌ల్ జైలులో అత్యధికంగా 435 మంది ఖైదీలు కరోనా బారిన‌ప‌డ్డారు. ఈ నేప‌థ్యంలోనే ఆ జైలులోని ఒక వార్డును పూర్తిగా క‌రోనా వార్డుగా మార్చామ‌ని అధికారులు చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo