గురువారం 16 జూలై 2020
National - Jun 21, 2020 , 12:10:39

సంప్ర‌దాయ దుస్తుల్లో రోబోలు.. క‌రోనా బాధితుల‌కు సేవ‌లు

సంప్ర‌దాయ దుస్తుల్లో రోబోలు.. క‌రోనా బాధితుల‌కు సేవ‌లు

రోబోలు రెస్టారెంట్‌లో సేవ‌లు చేయ‌డం చూశాం. అలాగే హాస్పిట‌ల్‌లో  రోగుల‌కు చేదోడుగా ప‌నిచేయ‌డం కూడా చూశాం. అయితే.. ప‌నికి త‌గిన‌ట్లుగా రోబోలు డ్రెస్సింగ్ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు కొత్త‌గా చీర‌క‌ట్టులో ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఈ దుస్తుల్లో రోబోలు క‌రోనా బాధితుల‌కు సేవ‌లు చేస్తుంటే.. అచ్చం ఇంట్లో వాళ్లు చేస్తున్న ఫీలింగ్ క‌లుగుతుందంటున్నారు పేషంట్లు.

గౌహ‌తీలో రెస్టారెంట్ నిర్వ‌హిస్తున్న ఎస్ఎన్ ఫ‌రీద్ ఏడాదిన్న‌ర‌గా త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు రోబోట్ల ద్వారా ఆహారం, పానీయాలు అందించేవారు. ఇప్పుడు ఆ రోబోట్ల‌ను క‌రోనా వైర‌స్ బాధితుల‌కు సేవ‌లు అందిస్తున్న హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు సాయం చేసేందుకు అందించారు. ఈ రోబోట్ల సాయంతో వైద్యులు బాధితుల వద్దకు వెళ్లకుండానే వేరే చోట కుర్చొని మాట్లాడగలుగుతున్నారు. ఈ రోబోట్లు ఆహారం, మందులు కూడా అందిస్తున్నాయి. రోబోట్లు అందిస్తున్న సేవలను ఈ వీడియోలో చూడగలరు. క‌రోనా క‌ష్ట‌కాలంలో రోబోలు ఇలా సాయం చేయడం చాలా అనాందంగా ఉంది. రోబోలు చేస్తున్న సేవ‌ల‌కు వీడియో చూడొచ్చు. 

 


logo