శనివారం 28 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 13:28:32

నకిలీ సంస్థల పేరుతో రూ. 392 కోట్ల ఫోర్జరీకీ పాల్పడిన వ్యక్తి అరెస్టు

నకిలీ సంస్థల పేరుతో రూ. 392 కోట్ల ఫోర్జరీకీ పాల్పడిన వ్యక్తి అరెస్టు

గుర్గావ్: నకిలీ పత్రాల ద్వారా కల్పిత సంస్థలను సృష్టించి, నిర్వహిస్తున్నట్లు రూ. 392 కోట్ల ఫోర్జరీ చేసిన ఢిల్లీ కి చెందిన కబీర్ కుమార్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఎటువంటి వస్తువులు లేదా సేవలను సరఫరా చేయకుండా ఇన్వాయిస్‌ లు జారీ చేయడం ద్వారా నకిలీ ఇన్‌ పుట్ టాక్సు క్రెడిట్‌ను పంపడం వంటి ఆరోపణలపై, హర్యానాలోని జి.ఎస్.‌టి. ఇంటెలిజెన్సు (డి.జి.జి.ఐ) డైరెక్టరేట్ జనరల్ గుర్గావ్ జోనల్ యూనిట్ (జి.జెడ్.యూ) కార్యాలయం కబీర్ కుమార్‌ను అరెస్టు చేసింది. గుర్గావ్, న్యూఢిల్లీ, ఫరీదాబాద్, సోలన్, నోయిడా, ఝాజ్హార్, సిర్సా మొదలైన ప్రాంతాల్లో, క్వీర్ కుమార్ కేవలం కాగితాలపై అనేక కల్పిత సంస్థలను సృష్టించినట్లు వెల్లడయ్యింది.

దర్యాప్తులో కబీర్ నగరం నుంచి పారిపోవడానికి కూడా ప్రయత్నించినట్లు తెలిసింది. అయితే, కస్టమ్స్ , సి.ఐ.ఎస్.ఎఫ్. అధికారుల సహకారంతో డి.జి.జి.ఐ. అధికారులు, అతన్ని  విమానాశ్రయంలో నిరోధించారు. 31 నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి, ఎటువంటి వస్తువులనూ సరఫరా చేయకుండా, రూ. 2,993.86 కోట్లమేర నకిలీ ఇన్వాయిస్ లను రూపొందించి, రూ. 392.37 కోట్ల మేర ఐ.టి.సి. ప్రయోజనాన్ని పొందినట్లు అతను ఒప్పుకున్నాడు. అతనికి సంబంధించిన ఒక వ్యక్తి నుంచి ల్యాప్‌ టాప్, మొబైల్ ఫోన్లు, 140 సిమ్ కార్డులు ఇతర సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జరిపిన దర్యాప్తుతో పాటు పలు దస్తావేజుల ఆధారంగా, నమోదు చేసిన నివేదికల ఆధారంగా, నకిలీ పత్రాలపై నకిలీ సంస్థలను ఏర్పాటు చేసే ఈ ముఠాను నిర్దేశించడంలో కబీర్ కుమార్ ముఖ్య వ్యక్తి అని తేలింది. దీంతో  కబీర్ కుమార్‌ ను అదుపులోకి తీసుకుని, ఢిల్లీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా, ఆయన న్యాయ విచారణకు ఆదేశించారు. మొత్తంమీద రూ.392 కోట్ల నకిలీ ఐ.టి.సి. ని నిందితులు జారీ చేశారు.ఈ విషయంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతున్నది.

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి