శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 16:55:39

ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు : బీహార్‌ మాజీ పోలీస్‌ బాస్‌

ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు : బీహార్‌ మాజీ పోలీస్‌ బాస్‌

న్యూఢిల్లీ : బీహార్‌ మాజీ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండే శనివారం ఓ కార్యక్రమంలో నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ (యునైటెడ్‌)లో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయమై మీడియా ఆయనను ప్రశ్నించగా.. తాను ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అంతకు ముందు రోజు ఆయన సీఎం నితీశ్‌కుమార్‌ను కలిశారు. రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే పాండే జేడీ(యూ)లో చేరవచ్చని ఊహాగానాలు చెలరేగాయి. ‘నేను డీజీపీగా నా విధుల్లో పూర్తి స్వేచ్ఛనిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు సీఎం నితీశ్‌కుమార్‌ కలిసేందుకు వచ్చానని, ఎన్నికల్లో పోటీ చేసే విషయమై నేను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పాండే సీఎంను కలిసిన అనంతరం విలేకరులకు చెప్పారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.