సోమవారం 25 జనవరి 2021
National - Dec 23, 2020 , 11:48:01

క‌శ్మీర్‌లో గుప్కార్.. అతిపెద్ద పార్టీగా బీజేపీ

క‌శ్మీర్‌లో గుప్కార్.. అతిపెద్ద పార్టీగా బీజేపీ

హైద‌రాబాద్‌: జమ్ము కశ్మీర్‌ జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల ఫలితాల్లో గుప్కార్‌ కూటమి జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.  110 సీట్లు సాధించిన గుప్కార్ కూట‌మి మొత్తం 13 జిల్లాల్లో ఆధిప‌త్యం కొన‌సాగిచింది. బీజేపీ పార్టీ 74 సీట్ల‌లో విజ‌యం సాధించి ఆరు జిల్లాలను సొంతం చేసుకున్న‌ది.  జ‌మ్మూ ప్రాంతంలో బీజేపీ త‌న హ‌వా కొన‌సాగించింది.  ఏడు పార్టీల‌తో కూట‌మి అయిన గుప్కార్‌.. క‌శ్మీర్‌లో త‌న ప్రాబ‌ల్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. గ‌త ఏడాది క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన త‌ర్వాత అక్క‌డ తొలిసారి డీడీసీ ఎన్నిక‌లు నిర్వ‌హించారు.  న‌వంబ‌ర్ 28 నుంచి డిసెంబ‌ర్ 19 వ‌ర‌కు ఎనిమిది ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి.  20 జిల్లాల్లోని 280 డీడీసీ  నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌మించారు.  

డీడీసీ ఎన్నిక‌ల్లో అత్య‌ధికంగా బీజేపీకి 74 సీట్లు ద‌క్కాయి.  ఇక ఆ త‌ర్వాత నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ 67, ఇండిపెండెంట్ 49, జ‌మ్మూక‌శ్మీర్ పీడీపీ 27, కాంగ్రెస్ 26, అప్నీ పార్టీ 12 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నాయి. డీడీసీ ఎన్నిక‌ల్లో బీజేపీకి పోలైన ఓట్ల శాతం అధికంగా ఉన్న‌ట్లు ఎన్నిక‌ల డేటా చెబుతున్న‌ది.  క‌శ్మీర్‌లో ఫారూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్ కూట‌మికి 72 సీట్లు ద‌క్కాయి.  అక్క‌డ బీజేపీ కేవ‌లం మూడు సీట్ల‌ను మాత్ర‌మే గెలుచుకున్న‌ది. శ్రీన‌గ‌ర్ జిల్లా ఫ‌లితం మాత్రం ఇంకా డోలాయ‌మానంలో ఉన్న‌ది. ఆ జిల్లాలో ఇండిపెండెంట్ల హ‌వా న‌డుస్తున్న‌ది. ఇక జ‌మ్మూ ప్రావిన్సులో బీజేపీ 71 సీట్లు గెలుచుకున్న‌ది.  జ‌మ్మూ, ఉద‌మ్‌పూర్‌, సాంబా, క‌థువా, రీసాయి, దోడా ప్రాంతాల్లో బీజేపీ 71 సీట్లు కైవ‌సం చేస‌కున్నది.  క‌శ్మీర్‌లో బీజేపీ తొలిసారి మూడు సీట్ల‌ను గెలుచుకున్న‌ది. ఇది మార్పుకు సంకేతం అని పార్టీ చెప్పింది.  ఎన్‌సీ, పీడీపీల‌పై ఆ పార్టీ గెల‌వ‌డం గ‌మ‌నార్హం. 


logo