బుధవారం 27 జనవరి 2021
National - Dec 24, 2020 , 16:30:59

గుప్కార్‌ కూటమి ఇప్పుడు చాలా బలంగా ఉంది: ఫరూక్

గుప్కార్‌ కూటమి ఇప్పుడు చాలా బలంగా ఉంది: ఫరూక్

శ్రీనగర్‌: గుప్కార్‌ కూటమి ఏర్పడినప్పటికంటే ఇప్పుడు చాలా బలంగా ఉన్నదని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, ఎన్సీ చీఫ్‌ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల ఫలితాలపై చర్చించడానికి పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్‌  డిక్లరేషన్ (పిఎజిడి) సభ్యులు శ్రీనగర్‌లో గురువారం సమావేశమయ్యారు. గుప్కార్‌ కూటమి ఏర్పడినప్పటి కంటే ఇప్పుడు తాము చాలా బలంగా, ఐక్యంగా ఉన్నామని ఫరూక్‌ చెప్పారు. తామంతా ఇలాగే ఐక్యంగా కొనసాగుతామని ఆయన అన్నారు. 

మరోవైపు జమ్ముకశ్మీర్‌ ప్రజలను ఇంకా నిర్బంధంలోనే ఎందుకు ఉంచుతున్నారని గుప్కార్‌ కూటమి సభ్యుడు, పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ లోన్ ప్రశ్నించారు. ఎన్నికలు చాలా శాంతియుతంగా నిర్వహించినప్పుడు, గతంలో మాదిరిగా ప్రజలను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారో అన్నది అర్థం చేసుకోలేకపోతున్నామని ఆయన విమర్శించారు. ప్రజల నిర్బంధాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. అదుపులోకి తీసుకున్న వారిని వెంటనే విడుదల చేయాలని సజ్జాద్ లోన్ డిమాండ్‌ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo