గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 03:06:01

కార్గిల్‌ శివంగి ‘గుంజన్‌ సక్సేనా’

కార్గిల్‌ శివంగి ‘గుంజన్‌ సక్సేనా’

న్యూఢిల్లీ: కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని భారత దేశపు తొలి మహిళా ఐఏఎఫ్‌ పైలట్‌, కార్గిల్‌ గాళ్‌గా ఖ్యాతికెక్కిన గుంజన్‌ సక్సేనా అమరవీరులకు నివాళులు అర్పించారు. గుంజన్‌ గురించి ఆమె తండ్రి లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఏకే సక్సేనా మాట్లాడారు. ఆర్మీ కుటుంబంలో పుట్టడం వల్ల ఆమెకు చిన్నప్పటి నుంచే సైన్యంలో పని చేయాలన్న అభిలాష ఉండేదన్నారు. ‘నేను పైలట్‌ అవుతాను’ అని తాను మొదటిసారి చెప్పినప్పుడు తన ఆకాంక్షలు నింగిని తాకేలా ఉన్నాయని అర్థం చేసుకున్నానని చెప్పారు. 1994లో తొలిసారిగా భారత వాయుసేనలో 25 మంది మహిళలను  పైలట్‌లుగా ఎంపిక చేశారు. అందులో గుంజన్‌ ఒకరు. కార్గిల్‌ యుద్ధ సమయంలో గుంజన్‌, మరొక పైలట్‌ శ్రీవిద్య రజన్‌తో కలిసి చీతా హెలికాప్టర్‌లో సైనికులతో పాటు ఆహారం, ఔషధాలను తరలించేవారు. కీలక సమయాల్లో సమర్థవంతమైన బాధ్యతను నిర్వర్తించిన గుంజన్‌కు శౌర్యచక్ర పురస్కారం లభించింది.  logo