ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతోన్న టాప్-100 అథ్లెట్లలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఒకడు. ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం (world’s highest-paid cricket captain) పొందుతోన్న జాబితాలో కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ అగ్రస్థానంలో ఉన్నాడు. కెప్టెన్గా కోహ్లీ కన్నా రూట్ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్గా ఉన్న కోహ్లీకి బీసీసీఐ అతనికి గ్రేడ్ ఏ+ కాంట్రాక్ట్ ఇచ్చింది.
కోహ్లీకి వార్షిక వేతనంగా రూ.7కోట్లను బీసీసీఐ చెల్లిస్తుంది. జో రూట్ ఏడాదికి రూ.7.22కోట్లను ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నుంచి తీసుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ కంటే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఎక్కువ మొత్తాన్ని అందుకుంటుండటం విశేషం. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథిగా వ్యవహరిస్తున్న కోహ్లీ 17కోట్లను వేతనంగా పొందుతున్నాడు.
ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్ టిమ్ పైన్ రూ.5కోట్లు.
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ రూ.62లక్షలు
శ్రీలంక కెప్టెన్ కరుణరత్నె రూ.51లక్షలు
న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ రూ.1.77 కోట్లు
సౌతాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ రూ.3.20 కోట్లు
ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రూ.1.75 కోట్లు
వెస్టిండీస్ వన్డే సారథి పోలార్డ్ రూ.1.73 కోట్లు