శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 24, 2020 , 12:13:05

గుజ‌రాతీ క‌ళాకారుల‌.. అద్భుత స్వాగ‌తం

గుజ‌రాతీ క‌ళాకారుల‌.. అద్భుత స్వాగ‌తం

హైద‌రాబాద్‌: అహ్మ‌దాబాద్‌లోని స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ స్టేడియం.. గుజ‌రాతీ సాంప్ర‌దాయ క‌ళానృత్యాల‌తో ఊగిపోయింది. ట్రంప్‌కు ఆహ్వానం ప‌లికేందుకు అక్క‌డ భారీ ఏర్పాట్ల‌ను చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఎయిర్‌ఫోర్స్ వ‌న్ విమానం దిగ‌గానే.. స్టేడియాన్ని క‌ళాకారులు చుట్టుకున్నారు.  విమానం నుంచి దిగిన ట్రంప్ దంప‌తుల‌కు ప్ర‌ధాని మోదీ స్వాగ‌తం ప‌లికారు. అతిథికి అద్భుత స్వాగ‌తం ల‌భించింది. గుజ‌రాతీయ సాంప్ర‌దాయంలో.. అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆహ్వానం ప‌లికారు.  స‌న్నాయి, డోలు వాయిద్యాలు వాయిస్తూ.. క‌ళాకారులు డ్యాన్స్ చేశారు.  ట్రంప్ దంప‌తుల‌ను మోదీ.. అధ్య‌క్షుడి బీస్ట్ కారులో ఎక్కించారు.  logo