గురువారం 09 జూలై 2020
National - Jun 17, 2020 , 20:19:45

మాస్కు ధ‌రించ‌ని మంత్రి.. రూ.200 ఫైన్‌

మాస్కు ధ‌రించ‌ని మంత్రి.. రూ.200 ఫైన్‌

అహ్మ‌దాబాద్: గుజ‌రాత్‌లో మాస్కు ధ‌రించ‌కుండా రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ హాజ‌రైన ఒక మంత్రికి అక్క‌డి అధికారులు జ‌రిమానా విధించారు. మంత్రి ఈశ్వ‌ర‌సిన్హ ప‌టేల్ ముఖానికి మాస్కు ధ‌రించ‌కుండానే బుధ‌వారం ముఖ్యమంత్రి కార్యాలయంలో జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశానికి హాజ‌ర‌య్యార‌ని, అందుకే ఆయ‌న‌కు రూ.200 జ‌రిమానా విధించామ‌ని గాంధీన‌గ‌ర్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు తెలిపారు. 

సీఎం విజ‌య్ రూపానీ ఆఫీస్‌లో జ‌రిగిన క్యాబినెట్‌ స‌మావేశానికి మంత్రి ఈశ్వ‌ర్‌సిన్హ పటేల్ త‌ప్ప మిగ‌తా మంత్రులంతా ముఖాల‌కు మాస్కులు ధ‌రించి హాజ‌ర‌య్యారు. మంత్రి మాస్కు ధ‌రించ‌కుండా మీటింగ్‌కు వ‌చ్చారంటూ స్థానిక మీడియా ప్ర‌చారం చేయ‌డంతో.. అధికారులు ఆయ‌న‌కు జ‌రిమానా విధించారు. స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న రూ.200 జ‌రిమానా చెల్లించారు. తాను కారులో మాస్కు మ‌ర్చిపోయాన‌ని, త‌ర్వాత త‌ప్పు తెలుసుకుని జ‌రిమానా చెల్లించాన‌ని ఆయ‌న చెప్పారు. 


logo