గురువారం 28 మే 2020
National - May 22, 2020 , 21:13:36

మరిన్ని సడలింపులు ఇస్తాం: గుజరాత్‌ సర్కారు

మరిన్ని సడలింపులు ఇస్తాం: గుజరాత్‌ సర్కారు

అహ్మదాబాద్‌: గుజరాత్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలకు శుక్రవారం శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన నిబంధనలను గుజరాతీయులు చక్కగా పాటిస్తున్నారని గుజరాత్‌ సీఎం సెక్రెటరీ అశ్వనీ కుమార్‌ తెలిపారు. సామాజిక దూరం, ముఖాలకు మాస్క్‌లు ధరించడం వంటి నిబంధనలను ప్రజలు చక్కగా పాటిస్తున్నారని చెప్పారు. 

ప్రజలు కరోనా నిబంధనలు చక్కగా పాటిస్తున్నందున మరికొన్ని సడలింపులు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని అశ్వినీ కుమార్‌ తెలిపారు. నిత్యావసర వస్తువులను అమ్మే దుకాణాలు సరి, బేసి సంఖ్యల విధానాన్ని పాటించవలసిన అవసరం లేదని చెప్పారు. అదేవిధంగా హైవేలపై పెట్రోలు పంపులు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరుచుకోవచ్చని చెప్పారు.


logo