సోమవారం 13 జూలై 2020
National - Jun 19, 2020 , 10:15:56

స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చి ఓటేసిన ఎమ్మెల్యే

స్ట్రెచ‌ర్‌పై వ‌చ్చి ఓటేసిన ఎమ్మెల్యే

అహ్మ‌దాబాద్‌: దేశ‌వ్యాప్తంగా ప‌ది రాష్ట్రాల్లోని 24 రాజ్య‌స‌భ‌ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. ఎమ్మెల్యేలంతా ఆయా అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు హ‌క్కు వినియోగించుకుంటున్నారు. అయితే, గుజ‌రాత్ బీజేపీ ఎమ్మెల్యే కేస‌రినాథ్ జెసంగ్‌భాయ్ సోలంకి అనారోగ్యం కార‌ణంగా ఇటీవ‌ల ఆస్ప‌త్రిలో చేరారు. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆస్ప‌త్రిలో ఉన్నా ఆయ‌న ఓటువేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. 

దీంతో బీజేపీ నేత‌లు ఈ ఉద‌యం ఆయ‌న‌ను అంబులెన్స్‌లో అసెంబ్లీకి తీసుకొచ్చి స్ట్రెచ‌ర్‌పై పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లారు. కాగా, ఓటు వేసిన అనంత‌రం ఎమ్మెల్యే సోలంకి నేరుగా ఆస్ప‌త్రికి తిరిగి వెళ్లారు. సోలంకి ప్ర‌స్తుతం మ‌తార్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. మొత్తం 10 రాష్ట్రాల్లో 24 స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతుండగా..  గుజ‌రాత్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌ రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాల‌కు, మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్థాన్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాల‌కు, జార్ఖండ్ నుంచి రెండు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాల‌యా, మ‌ణిపూర్‌, అరుణాచ‌ల్‌ప్ర‌‌దేశ్‌, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కొక్క స్థానానికి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. 


logo