1. శాతవాహనుల కాలంలో స్త్రీలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) స్త్రీలకు సమాజంలో స్వేచ్ఛ ఉండేది
2)శాతవాహన స్త్రీలు బౌద్ధ విహారాలు, చైత్యాలు, ఆరామాలకు దానధర్మాలు చేశారు
3) మాధవి, రేవతి, అనులక్ష్మి మంచి కవయిత్రులు
4) శాతవాహనుల కాలంనాటి సతీసహమగనాన్ని చెప్పినది మెగస్తనీస్
2. కామసూత్రం ప్రకారం శాతవాహనుల ప్రధాన పండుగ కానిది?
1) కౌముది యాగం 2) ఉగాది
3) హాలక పండుగ 4) మదనోస్తవం
3. శాతవాహనుల కాలంనాటి మతానికి సంబంధించి సరికానిది?
1) శాతవాహనులు మొదట జైనమతాన్ని పోషించారు
2) శాతవాహనులు శైవ మతంలోని పాశుపత శాఖను పోషించారు
3) శాతవాహనుల రాణులు వైదిక మతాన్ని పోషించారు
4) మహాయాన శాఖ బాగా అభివృద్ధి చెందింది
4. కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) ఆంధ్రలో అతి ప్రాచీనమైన శైవ దేవాలయం గుడిమల్లం
2) గుడిమల్లం కడప జిల్లాలో ఉంది
3) శివం అంటే శాంతి అని అర్థం
4) కర్నూలులో 14 శివాలయాలు బయల్పడ్డాయి
5. కొండ కుండనాచార్యునికి సంబంధించి సరికానిది?
1) ఆంధ్రలో జైనమతాన్ని వ్యాప్తి చేశాడు
2) ఇతని ఆశ్రమం అనంతపురం జిల్లా కొనకొండ్లలో ఉంది
3) ఈయన సమయసారం, నియమసారం అనే గ్రంథాలను రచించాడు
4) ఇతను సూత్రావతారం అనే గ్రంథాన్ని రచించాడు
6. కింది వాటిలో సరికాని వాక్యం?
1) ఆంధ్రలో బౌద్ధమతాన్ని వ్యాప్తి చేసింది మహాదేవ భిక్షువు
2) ప్రతీత్య సంవాద సిద్ధాంతం బౌద్ధ మతానికి చెందింది
3) వీరి కాలంలో బౌద్ధమత ప్రధాన కేంద్రం ధాన్యకటకం
4) దేవి నాగశ్రీ అనేక వివాహారాలను కట్టించింది
7. కింది వాటిలో సరికానిది?
1) శాతవాహనుల కాలంలో ప్రసిద్ధ బౌద్ధాచార్యుడు ఆచార్య నాగార్జునుడు
2) నాగార్జునుని వల్ల యజ్ఞశ్రీ బౌద్ధమతాన్ని స్వీకరించాడు
3) నాగార్జునుడు మూడో బౌద్ధ సంగీతికి హాజరయ్యాడు
4) సుహృల్లేఖ ఒక న్యాయ గ్రంథం
8. సుహృల్లేఖ , రత్నావళి ఎవరి రచనలు?
1) ఆచార్య నాగార్జునుడు
2) మహాదేవ భిక్షువు
3) కొండ కుండనాచార్యుడు
4) యజ్ఞశ్రీ శాతకర్ణి
9. కింది వాటిలో సరికానిది?
1) సుహృల్లేఖ అనేది ఒక లేఖ
2) సుహృల్లేఖను నాగార్జునుడు యజ్ఞశ్రీకి రాశాడు
3) నాగార్జునుడి గ్రంథాల్లో ముఖ్యమైనది రత్నావళి
4) నాగార్జునుడిని ఇండియన్ ఐన్స్టీన్ అని పిలుస్తారు
10. ఇండియన్ మార్టిన్ లూథర్, రెండో బుద్ధుడు ఎవరి బిరుదులు?
1) ఆచార్య నాగార్జునుడు
2) మహాదేవ భిక్షువు
3) కొండ కుండనాచార్యుడు
4) కౌటిల్యుడు
11. కింది వాటిలో సరికానిది?
1) పూర్వ శైలి- ధాన్యకటకం
2) అపర శైలి- శ్రీపర్వతం
3) ఉత్తర శైలి- జగ్గయ్యపేట
4) రాజగిరిక- గుడివాడ
12. కింది వాటిలో స్థూపాలకు సంబంధించి సరికానిది?
1) బుద్ధుడిపై భక్తితో నిర్మించే స్థూపాలను ఉద్దేశిక స్థూపాలు అంటారు
2) బుద్ధుడి వెంట్రుకలపై నిర్మించే స్థూపాలను ధాతుగర్భ స్థూపాలు అంటారు
3) నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అమరావతి, శాలిహుండం ధాతుగర్భ స్థూపాలు
13. పంచకల్యాణులకు సంబంధించి సరికానిది?
1) తామర- బుద్ధుని జననం
2) గుర్రం- బుద్ధుని ఇంటిని వదలడం
3) రావిచెట్టు- బుద్ధుడి తొలి ప్రబోధం
4) స్థూపం- బుద్ధుడి మరణం
14. కింది వాటిలో సరికానిది?
1) బౌద్ధుల విశ్రాంతి మందిరాన్నివిహారం అంటారు
2) బౌద్ధ సన్యాసుల ప్రార్థనా మందిరాన్ని చైత్యం అంటారు
3) చైత్యం దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది.
4) విహారం త్రిభుజాకారంలో ఉంటుంది
15. కింది వాటిలో అజంతా గుహలకు సంబంధించి సరికానిది?
1) ఇవి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి
2) అజంతా గుహలను మొదట ప్రారంభించింది మౌర్యులు
3) అజంతా గుహల్లో 9, 10 గుహలు శాతవాహనుల కాలంనాటివి
4) అజంతా గుహల్లో జైనమతానికి చెందిన భావాలు కనిపిస్తాయి
16. ‘గుల్మిక’ అనే పదాన్ని పేర్కొన్న శాసనం?
1) మ్యాకధోని శాసనం
2) మంచిగల్లు శాసనం
3) అమరావతి శాసనం
4) నాగార్జున కొండ శాసనం
17. శాతవాహనుల కాలం నాటి సప్తగోదావరిని ఏమని వ్యవహరిస్తున్నారు?
1) అమరావతి 2) భట్టిప్రోలు
3) ద్రాక్షారామం 4) ఘంటశాల
18. సగం సంస్కృతం, సగం ప్రాకృతిక పదాలు ఉన్న శాసనం?
1) రుద్రదత్తుని నాసిక్ శాసనం
2) నహపాలుడి జున్నార్ శాసనం
3) రుద్రధాముని గిర్నార్ శాసనం
4) నాగానిక నానాఘాట్ శాసనం
19. శాతవాహనుల కాలం నాటి నాణేల పేర్లు ఏ శాసనం వల్ల తెలుస్తుంది?
1) నానాఘాట్ శాసనం
2) రుద్రదత్తుని నాసిక్ శాసనం
3) చినగంజాం శాసనం
4) పులోమావి కార్లే శాసనం
20. కింది వాటిలో సరికానిది?
1) శాతవాహనులందరిలో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి
2) శాతవాహనుల్లో చివరి గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి
3) మొదటి శాతవాహనుల్లో గొప్పవాడు మొదటి శాతకర్ణి
4) నవనగర స్వామి అనే బిరుదు రెండో పులోమావికి ఉందిఇక్ష్వాకులు
21. కింది వాటిలో సరికానిది?
1) ఇక్ష్వాక సామ్రాజ్య స్థాపకుడు-శ్రీశాంతమూలుడు
2) ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు
3) ఇక్ష్వాకుల రాజధాని విజయపురి
4) ఇక్ష్వాకుల రాజచిహ్నం- సింహం
22. కింది వాటిలో సరికానిది?
1) ఇక్ష్వాక సామ్రాజ్య స్థాపకుడు శ్రీశాంతమూలుడు
2) ఇక్ష్వాకులందరిలోకి గొప్పవాడు వీరపురుష దత్తుడు
3) హిందూ దేవాలయాలను నిర్మించింది-ఎహూవల శాంతమూలుడు
4) ఇక్ష్వాకుల మతం జైనమతం
23. ఇక్ష్వాకుల గురించి తెలిపే పురాణం?
1) మత్స్యపురాణం 2) విష్ణుపురాణం
3) వాయు పురాణం 4) బ్రహ్మాండ పురాణం
24. ఇక్ష్వాకులకు సంబంధించి సరికానిది?
1) ఇక్ష్వాకులు శ్రీరాముని వంశస్థులు
2) ఇక్ష్వాక అంటే చెరకురసం అని అర్థం
3) ఇక్ష్వాకుల గురించి బాగా వర్ణించినది హనుమంతరావు
4) ఇక్ష్వాకుల గురించి బాగా వర్ణించింది సుబ్రమణ్యం
25. ఇక్ష్వాకుల ప్రత్యేకతకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) ఇక్ష్వాకుల ప్రధానవృత్తి వ్యాపారం
2) ఇక్ష్వాకులు ప్రాకృతంలో
శాసనాలను జారీచేశారు
3) వీరగల్ సంప్రదాయాలను ప్రారంభించారు
4) మాతృదేవతారాధన వీరి కాలంలోనే ప్రారంభమయ్యింది
26. శ్రీశాంతమూలుడు ఎవరిని ఓడించి రాజ్యస్థాపన చేశారు?
1) యజ్ఞశ్రీ 2) మూడో పులోమావి
3) రెండో శాతకర్ణి 4)వాశిష్టీపుత్ర శాతకర్ణి
27. కింది ఎవరిని ఇక్ష్వాక రాజును మహారాజు అనే బిరుదుతో సంబోధించారు?
1) వీరపురుష దత్తుడు
2) ఎహూవల శాంతమూలుడు
3) శ్రీశాంతమూలుడు
4) రుద్రపురుష దత్తుడు
28. కింది వాటిలో సరికానిది?
1) వాజపేయ యాగం- స్వరాట్
2) వాజపేయ యాగం- సామ్రాట్
3) నరమేధ యాగం- ఏక విరాట్
4) వాజపేయ యాగం- విరాట్
29. కింది వాటిలో సరికానిది?
1) శ్రీశాంతమూలుడు అశ్వమేధ ముద్రికలతో నాణేలు వేయించాడు
2) సామ్రాట్ రూపంలో నాణేలను ముద్రించాడు
3) శ్రీశాంతమూలుడి కాలంలో ఒక స్టేడియాన్ని నిర్మించారు
4) శ్రీశాంతమూలుడి భార్య పేరు మఠరశ్రీ
30. వ్యవసాయ అభివృద్ధి కోసం బంగారు నాణేలు, గోవులు, నాగళ్లను దానం చేసింది?
1) శ్రీశాంతమూలుడు
2) ఎహూవల శాంతమూలుడు
3) వీరపురుష దత్తుడు
4) రుద్రపురుష దత్తుడు
31. శ్రీశాంతమూలుడి కుటుంబ సభ్యులకు సంబంధించి సరికానిది?
1) భార్య- మఠరశ్రీ
2) కూతురు- అటవి శాంతిశ్రీ
3) కుమారుడు- ఎహూవల శాంతమూలుడు
4) సోదరీమణులు- శాంతిశ్రీ, హర్మ్యశ్రీ
32. కింది వారిలో ఇక్ష్వాక రాజుల్లో గొప్పవాడు?
1) వీరపురుష దత్తుడు
2) శ్రీశాంతమూలుడు
3) ఎహూవల శాంతమూలుడు
4) ఎవరూకాదు
33. దక్షిణ భారతదేశ అశోకుడిగా కీర్తిగాంచింది?
1) శ్రీశాంతమూలుడు
2) వీరపురుష దత్తుడు
3) ఎహూవల శాంతమూలుడు
4) రుద్రపురు దత్తుడు
34. కింది వాటిలో శాసనాలకు సంబంధించి సరికానిది?
1) ఇక్ష్వాకుల పతనాన్ని తెలిపేది మైదవోలు శాసనం
2) అమరావతి శాసనం, అల్లూరి శాసనాలను శ్రీశాంతమూలుడు వేయించాడు
3) దక్షిణ గయ అని విజయపురిని పిలుస్తారు
4) వీరపురుష దత్తుడు హైందవ మతాన్ని కించపరిచాడు
35. నాగార్జునకొండ వద్ద శివలింగాన్ని కాలితో తొక్కుతున్నట్లు ఏ రాజు విగ్రహం లభించింది?
1) వీరుపురుష దత్తుడు
2) శ్రీశాంతమూలుడు
3) ఎహూవల శాంతమూలుడు
4) రుద్రపురుష దత్తుడు
36. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమతానికి ఎనలేని సేవ చేసిన స్త్రీ?
1) మఠరశ్రీ 2) ఉపాసిక బోధిశ్రీ
3) అటవి శాంతిశ్రీ 4) హర్మ్యశ్రీ
37. కింది వాటిలో సరికానిది?
1) హిందూ దేవాలయాలను నిర్మించినవాడు ఎహూవల శాంతమూలుడు
2) దక్షిణ భారతదేశంలో మొదట సంస్కృత భాషలో శాసనాలను జారీచేసింది ఎహూవల
3) నవగ్రహాలయం విజయపురిలో ఉంది
4) హారతి దేవాలయాన్ని నిర్మించింది ఎహూవల శాంతమూలుడు
38. ఎలిసిరి ఎవరి సేనాని?
1) ఎహూవల శాంతమూలుడు
2) శ్రీశాంతమూలుడు
3) రుద్రపురుష దత్తుడు
4) వీరపురుష దత్తుడు
39. రుద్రపురుష దత్తుడికి సంబంధించి సరికానిది?
1) శాతవాహనుల నుంచి వచ్చిన
ఆనవాయితీని అనుసరించాడు
2) ఇక్ష్వాకుల్లో చివిర వాడు
3) ఇతడు అనేక రాజ్యాలను ఆక్రమించాడు
4) ఇతడు సమాధుల దగ్గర ఛాయా స్తంభాలను నిర్మించాడు
40. కింది వాటిలో సరికానిది?
1) జినామృతం- జినవల్లభుడు
2) ఇక్ష్వాకులు సతీసహగమనాన్ని ప్రారంభించారు
3) ఇక్ష్వాకుల కాలంలో జైనమతం బాగా అభివృద్ధి చెందింది
4) మత్స్యపురాణం ప్రకారం
7 మంది రాజులు పాలించారు
41. శాసనాల ప్రకారం ఇక్ష్వాక రాజులు ఎంతమంది?
1) 4 2) 5 3) 6 4) 7
42. ఇక్ష్వాక పాలనకు సంబంధించి సరికానిది?
1) వీరు మౌర్యులను అనుసరించారు
2) వీరి కాలంలో రాజ్యానికి అధిపతి రాజు
3) వీరు రాజ్యాన్ని ఆహారాలుగా విభజించారు
4) మహాసేనాధిపతి నేరాలను పరిష్కరించేవాడు
43. కింది వాటిలో సరికానిదానిని గుర్తించండి?
1) పర్ణిక శ్రేణి- తమలపాకుల సంఘం
2) పూసిన శ్రేణి- మిఠాయిల సంఘం
3) ఇక్ష్వాకులు హిందూ మతాన్ని ఆదరించారు
4) ఇక్ష్వాక రాజులందరూ యాగాలు చేశారు
44. కింది వాటిలో దేనిని ద్వీప మ్యూజియం అంటారు?
1) నాగార్జునకొండ 2) శ్రీపర్వతం
3) అమరావతి 4) బుద్ధగయ
45. నాగార్జునకొండకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) నాగార్జునకొండను నిర్మించింది యజ్ఞశ్రీ
2) ఇది నాగార్జునుడి కోసం నిర్మించింది
3) దీనిని 1500 గదులతో నిర్మించారు
4) ఇక్కడ శివాలయాలు కూడా ఉన్నాయి