బుధవారం 08 జూలై 2020
National - Jun 21, 2020 , 16:05:08

జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌పై హైకోర్టు స్టే

జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌పై హైకోర్టు స్టే

అహ్మ‌దాబాద్ : అహ్మ‌దాబాద్ లో నిర్వ‌హించే జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌పై గుజ‌రాత్ హైకోర్టు స్టే విధించింది. క‌రోనా మ‌హ‌మ్మారి అహ్మ‌దాబాద్ లో ఎక్కువ‌గా ఉన్నందున యాత్ర‌కు అనుమ‌తి నిరాక‌రిస్తున్న‌ట్లు కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ప్ర‌స్తుతం క‌రోనా కేసులు అధికంగా ఉన్న నేప‌థ్యంలో.. యాత్ర‌పై స్టే విధిస్తున్న‌ట్లు కోర్టు పేర్కొంది. ఒక వేళ యాత్ర‌కు అనుమ‌తిస్తే.. పెద్ద సంఖ్య‌లో జ‌నాలు గుమిగూడే అవ‌కాశం ఉంది. త‌ద్వారా వైర‌స్ వ్యాప్తి చెందే అవ‌కాశం ఉంద‌ని కోర్టు తెలిపింది. అయితే అహ్మ‌దాబాద్ లో జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర 1878 త‌ర్వాత నిర్వ‌హించ‌క‌పోవ‌డం ఇదే తొలిసారి.  

ఒడిశాలోని పూరిలో కూడా జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్ర‌కు సుప్రీంకోర్టు అనుమ‌తి నిరాక‌రించింది. పూరి త‌ర్వాత అహ్మ‌దాబాద్ లోనే అతి పెద్ద‌గా జ‌ర‌గ‌నుంది ర‌థ‌యాత్ర‌. అయితే అహ్మ‌దాబాద్ లోని జ‌మ‌ల్పూర్ నుంచి కొన‌సాగే ఈ ర‌థ‌యాత్ర‌.. కంటైన్ మెంట్ జోన్ల మీదుగా సాగ‌నుంది. అక్క‌డ వంద‌లాది మంది క‌రోనాతో చ‌నిపోయారు. కాబ‌ట్టి.. వైర‌స్ వ్యాప్తి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ ర‌థ‌యాత్ర‌లో ల‌క్ష మందికి పైగా పాల్గొనే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో ర‌థ‌యాత్ర‌కు అనుమ‌తి నిరాక‌రించింది గుజ‌రాత్ కోర్టు.   


logo