మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 08, 2020 , 16:04:34

గుజరాత్‌ హైకోర్టు మూసివేత

గుజరాత్‌ హైకోర్టు మూసివేత

అహ్మదాబాద్‌ : కరోనా మహమ్మారి కారణంగా గుజరాత్‌ హైకోర్టు మూతపడింది. కోర్టులోని రిజిస్ట్రీ సిబ్బంది ఆరుగురితో పాటు విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కానిస్టేబుల్‌కు కొవిడ్‌-19 పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో కోర్టు ఆవరణను శానిటైజ్‌ చేసేందుకు ఈ నెల 10వ తేదీ వరకు మూసివేయనున్నారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు కోర్టు ఆవరణను మూసివేస్తున్నట్లు సర్కుల్యర్‌ జారీ చేసింది. ఈ మూడు రోజుల్లో అహ్మదాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ హైకోర్టు, జ్యుడిషియల్‌ అకాడమీ, ఆడిటోరియంతో పాటు చాంబర్లు, కార్యాలయాలు, రికార్డ్‌ రూంలు అన్నీ శుభ్రం చేయనున్నట్లు తెలిపింది. అప్పటి వరకు హైకోర్టు న్యాయవాదుల విధులను సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo