ముంబై: దేశంలోకెల్లా అతిపెద్ద వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. తన కస్టమర్లకు నిరాశ కలిగించే విషయం ఒకటి బయటపెట్టింది. బేసిక్ సేవింగ్స్ అంటే జీరో బ్యాలెన్స్ ఖాతా (బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-బీఎస్‌బీడీ) కలవారి నుంచి వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి కొత్త సర్వీసు ఛార్జీలు వసూలు చేయనుంది.
నగదు ఉపసంహరణ, చెక్‌బుక్‌పై పరిమితులు విధించామన్నది. ఆ పరిధి దాటితే రుసుముల వసూళ్లు వర్తిస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.
ఏదేనీ ఎస్బీఐ శాఖలోగానీ, ఏటీఎంలోగానీ మొత్తం నాలుగు సార్లు మాత్రమే ఉచితంగా నగదు విత్ డ్రాయల్‌కు అనుమతి ఇచ్చింది. అంతకంటే ఎక్కువ సార్లు నగదు తీసుకోవాలనుకుంటే.. ప్రతిసారి రూ.15లతో పాటు జీఎస్టీ అదనంగా చెల్లించాలి.
ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నా ఇవే ఛార్జీలు వర్తిస్తాయి. ఇకపై ఎస్బీఐ ఖాతాదారులు ఎస్బీఐయేతర ఏటీఎంలు, ఎస్బీఐ శాఖతో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇక బీఎస్‌బీడీ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లీవ్స్‌తో కూడిన చెక్‌బుక్‌ను ఎస్బీఐ ఉచితంగా అందజేస్తుంది. అంతకంటే ఎక్కువ లీవ్స్ గల చెక్ బుక్ కావాలంటే అదనపు చార్జీలు చెల్లించాల్సిందే. 10 లీవ్స్ కల చెక్బుక్కు రూ.40లతోపాటు అదనంగా జీఎస్టీ చెల్లించాలి.
ఒకవేళ 25 చెక్ లీవ్స్ కలిగిన బుక్ కావాలంటే జీఎస్టీతో పాటు రూ.75 కట్టాలి. ఒకవేళ అత్యవసరంగా చెక్ బుక్ కావాలని కోరితే.. 10 లీవ్స్‌కి రూ.50+జీఎస్టీ చెల్లించాలి. అయితే, సీనియర్ సిటిజన్లకు మాత్రం చెక్ బుక్ ఛార్జీలు వర్తించబోవని ఎస్బీఐ వెల్లడించింది.
కొత్త ఐటీ నిబంధనలతో పౌరుల ప్రైవసీ ఉల్లంఘనే: వాట్సాప్
జగన్ బెయిల్ విచారణ జూన్ 1కి వాయిదా
Flipkart Shop From Home Days sale: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్ సేల్
మొదటి డోసు కోవిషీల్డ్.. రెండోసారి కోవాగ్జిన్
జూన్ 1 నుంచి అలిపిరి నడక మార్గం మూసివేత
యాస్‌తో 3 లక్షల ఇండ్లకు నష్టం : మమతా బెనర్జీ
ఉత్తరాది ఓటర్లపై డీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు
చిన్న పరిశ్రమలకు త్వరలో ఉద్దీపన ప్యాకేజీ
బంగారం కొనుగోలుదారులకు ఊరట.. ఎందుకంటే?!
బంగారం బుల్ రంకె.. నెలలోనే 7% పైపైకి?!
ఆటో కంపెనీల వారంటీ, ఫ్రీ సర్వీస్ పీరియడ్ పొడిగింపు!
గల్వాన్ సరిహద్దు ఘర్షణ వేళ.. డ్రాగన్‌కు ఆ ఎగుమతులు రెట్టింపు!!
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
200 కోట్ల డోస్‌ల ఉత్పత్తికి వాక్‌హార్డ్ రెడీ.. కానీ?!