ఆదివారం 05 జూలై 2020
National - Jun 25, 2020 , 20:53:31

కరోనా పరీక్షల రేట్లను తగ్గించిన గుజరాత్‌

కరోనా పరీక్షల రేట్లను తగ్గించిన గుజరాత్‌

అహ్మదాబాద్‌ : ప్రజలకు ఊరట కలిగించేలా గుజరాత్‌ ప్రభుత్వం ప్రైవేటు ల్యాబరేటరీల్లో కొవిడ్‌-19లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితిన్ పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వ అధీకృత ప్రైవేటు ప్రయోగశాలలు కొవిడ్‌-19 పరీక్షల కోసం రూ.4వేలు కాకుండా రూ.2500 వసూలు చేస్తాయని చెప్పారు. నమూనాలను సేకరించేందుకు ప్రయోగశాల సహాయకుడిని ఇంటికి పిలిస్తే రూ.౩వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజులు వెంటనే అమల్లోకి వస్తాయని పటేల్‌ ప్రకటించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులకంటే ఎక్కువ వసూలు చేస్తే లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. 

ప్రభుత్వం నిర్ణయించే కేంద్రాల్లో టెస్టులు ఉచితంగా చేస్తున్నా.. నిత్యం సుమారు 500 మంది ప్రైవేటు ల్యాబ్‌లను ఎంచుకుంటున్నారని పటేల్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం ప్రతిపక్ష నాయకుడు పరేష్ ధననీ మాట్లాడుతూ కరోనా వైరస్ పరీక్ష కోసం ప్రజల నుంచి రూ.1,000 కంటే ఎక్కువ వసూలు చేయొద్దన్నారు. అంతకు ముందు జూన్ 15న ట్విట్టర్‌లో రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్, అహ్మదాబాద్‌లో పరీక్ష కోసం రూ.4,500 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశించారు. అదే ముంబైలో పరీక్షల కోసం ముంబైలో రూ.2,200 వసూలు చేస్తున్నారని ట్వీట్‌ చేశారు.


logo