శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 14:02:51

మరోసారి లేచిపోయిన నాటి ప్రేమికులు

మరోసారి లేచిపోయిన నాటి ప్రేమికులు

సూరత్‌ : యవ్వన దశలో చిగురించిన ప్రేమ.. మధ్య వయసులో గుర్తుకు వచ్చింది. దాంతో ఇద్దరూ లేచిపోయారు. తర్వాత రెండు వారాలకు తిరిగి తమ నివాసాలకు చేరుకున్నారు. మళ్లీ నెల రోజుల తర్వాత ఆ ప్రేమికులు ఎవరికీ చెప్పపెట్టకుండా లేచిపోయారు. సూరత్‌కు చెందిన హిమ్మత్‌ పాండవ్‌(46) కుమారుడిని నవ్‌సారికి చెందిన శోభన రావల్‌(43) కుమార్తె ఈ ఏడాది జనవరి నెలలో వివాహం జరగాల్సి ఉండే. అయితే హిమ్మత్‌, శోభన యవ్వన దశలో ప్రేమించుకున్నారు. కానీ వీరి ప్రేమను పెద్దలు తిరస్కరించడంతో.. వేరే వారిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా హిమ్మత్‌ కుమారుడితో శోభన కూతురు వివాహం కుదరడంతో.. వరుసకు అన్నాచెల్లెలు అవ్వాల్సి వస్తుందని వారు భావించారు. ఆ బంధం ఇష్టం లేక.. తామిద్దరం ప్రేమికులుగానే ఉండిపోవాలని హిమ్మత్‌, శోభన నిర్ణయించుకున్నారు. దీంతో జనవరి 10వ తేదీన ఇద్దరూ లేచిపోయారు. అదే నెల 26వ తేదీకి వారి నివాసాలకు తిరిగొచ్చారు. శోభనను ఆమె భర్త స్వీకరించలేదు. చేసేదేమీ లేక శోభన తన తల్లిగారింటికి వెళ్లింది. ఈ ఎడబాటు భరించలేని శోభన.. మరోసారి హిమ్మత్‌తో లేచిపోయింది. వీరిద్దరూ సూరత్‌లో ఓ కిరాయి ఇంట్లో నివసిస్తున్నారు. 


logo