బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 13, 2020 , 09:34:59

ఆ కారును ఆపినందుకు మ‌హిళా కానిస్టేబుల్ బ‌దిలీ

ఆ కారును ఆపినందుకు మ‌హిళా కానిస్టేబుల్ బ‌దిలీ

అహ్మ‌దాబాద్ : ఎమ్మెల్యే కుమారుడి కారు ఆపినందుకు ఓ మ‌హిళా కానిస్టేబుల్ ను బ‌దిలీ చేశారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్ లోని సూర‌త్ లో బుధ‌వారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి దృష్ట్యా సూర‌త్ లో రాత్రి స‌మ‌యాల్లో క‌ర్ఫ్యూ విధించారు. ఈ స‌మ‌యంలో వ‌చ‌రా రోడ్డు ఎమ్మెల్యే కుమార్ క‌నాని కుమారుడు ప్ర‌కాశ్ క‌నాని త‌న ఇద్ద‌రు మిత్రుల‌తో కారులో వెళ్తున్నాడు. దీంతో ఆ కారును విధుల్లో ఉన్న మ‌హిళా కానిస్టేబుల్ సునిత యాద‌వ్ ఆపారు. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించారంటూ, మాస్కు ధ‌రించ‌లేదంటూ వారిని కానిస్టేబుల్ నిల‌దీశారు. ఈ క్ర‌మంలో కానిస్టేబుల్ కు ప్ర‌కాశ్ మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

కాసేప‌టి త‌ర్వాత ఎమ్మెల్యే కుమార్ ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని కానిస్టేబుల్ ను బెదిరింపుల‌కు గురి చేశారు. 365 రోజులు ఒకే చోట ఉండేలా చేస్తాన‌ని ప్ర‌కాశ్ హెచ్చ‌రించాడు. దీనికి కానిస్టేబుల్ బ‌దిలీస్తూ.. తాను బానిస కాద‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తానికి రాజ‌కీయ ఒత్తిళ్ల కార‌ణంగా.. సునిత యాద‌వ్ ను పోలీసు హెడ్ క్వార్ట‌ర్స్ కు బ‌దిలీ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ‌కు సూర‌త్ పోలీసు క‌మిష‌న‌ర్ ఆదేశించారు. బ‌దిలీ అయిన సునిత యాద‌వ్.. అనారోగ్య కార‌ణంగా సెలవు పెట్టారు. 


logo