మంగళవారం 07 జూలై 2020
National - Jun 05, 2020 , 13:44:02

కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎమ్మెల్యే గుడ్‌బై

కాంగ్రెస్ పార్టీకి మ‌రో ఎమ్మెల్యే గుడ్‌బై

హైద‌రాబాద్‌: గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్రిజేశ్ మీర్జా.. కీల‌క‌మైన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు రాజీనామా చేశారు.  జూన్ 19వ తేదీన రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో బ్రిజేశ్ రాజీనామా చేయ‌డం సంచ‌ల‌నం రేపుతున్న‌ది. ఎమ్మెల్యే బ్రిజేశ్ రాజీనామాను స్పీక‌ర్ రాజేంద్ర త్రివేది ఆమోదించారు. అసెంబ్లీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు బ్రిజేశ్ తెలిపారు. మోర్బీ స్థానం నుంచి ఎన్నికైన బ్రిజేశ్ రాజీనామాను స్పీక‌ర్ ఆమోదించిన‌ట్లు అసెంబ్లీ సెక్ర‌టేరియేట్ పేర్కొన్న‌ది.  గ‌త మూడు రోజుల నుంచి గుజ‌రాత్‌లో  ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రైమ‌రీ స‌భ్య‌త్వానికి కూడా ఎమ్మెల్యే బ్రిజేశ్ రాజీనామా చేయ‌డం గ‌మ‌నార్హం.  బుధ‌వారం రోజున అక్ష‌య్ ప‌టేల్‌, జీతూ చౌద‌రీ ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేశారు. మార్చి నెల నుంచి గుజ‌రాత్ కాంగ్రెస్‌లో 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. logo