గురువారం 09 జూలై 2020
National - Apr 18, 2020 , 12:26:20

వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదైన ఆరో రాష్ట్రంగా గుజరాత్‌

వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదైన ఆరో రాష్ట్రంగా గుజరాత్‌

అహ్మదాబాద్‌: దేశంలో వెయ్యి అంతకన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదైన ఆరో రాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. రాష్ట్రంలో గత 12 గంటల్లో 176 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క అహ్మదాబాద్‌లోనే 143 కేసులు బయటపడ్డాయి. దీంతో గుజరాత్‌లో కరోనా కేసుల సంఖ్య 1,272కు చేరింది. గత 24 గంటల్లో ఏడుగురు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 48కి చేరింది. 

దేశంలో కరోనావైరస్‌కు ప్రధాన కేంద్రంగా మారిన మహారాష్ట్రలో ఇప్పటివరకు 3205 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా దేశ రాజధాని 1640 కరోనా కేసులతో రెండో స్థానంలో ఉన్నది. 1323 కరోనా పాజిటివ్‌ కేసులతో తమిళనాడు నాలుగోస్థానంలో ఉండగా, 1193 కేసులతో రాజస్థాన్‌ ఐదో స్థానంలో ఉన్నది.


logo